Maa Annayya Serial: జీ తెలుగులో `మా అన్నయ్య` సీరియల్.. బుల్లితెరపైకి మైత్రీ మూవీ మేకర్స్ ఎంట్రీ
Zee Telugu New Serial Maa Annayya: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. మా అన్నయ్య సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువకానుంది. ఈ సీరియల్ జీ తెలుగులో మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. సోమవారం నుంచి శనివారం ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.
Zee Telugu New Serial Maa Annayya: మరో సరికొత్త సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు సిద్ధమైంది. అన్నాచెల్లళ్ల అనుబంధం, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన మా అన్నయ్య సీరియల్ మార్చి 25వ తేదీ నుంచి జీ తెలుగులో ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ ద్వారా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. తొలిసారి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సీరియల్ ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు గోకుల్ మీనన్ నటించారు. ఆయన గంగాధర్ పాత్రలో నటిస్తుండగా.. రాధమ్మ కూతరు పాత్రను అరవింద్ పోషించారు. సీరియల్ కథ అంతా గంగాధర్ లైఫ్ చుట్టూ తిరుగుతుంది.
Also Read: IPL 2024 Recharge Plans: అంతరాయం లేకుండా ఐపీఎల్ చూసేందుకు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
కథ ఏంటి..?
గంగాధర్‌కు నలుగురు చెల్లెళ్లు ఉంటారు. తండ్రి మల్లికార్జున్ (ఉదయ్) తాగుడికి బానిసకాగా.. తల్లి సావిత్రి (రాశి) పిల్లలను వదిలేసింటుంది. దీంతో చెల్లెళ్ల బాధ్యత గంగాధర్ తీసుకుంటాడు. తన చెల్లళ్లకు మంచి సంబంధాలు చూసి.. గొప్పింటికి ఇచ్చి పెళ్లి చేయాలని గంగాధర్ కలలు కంటాడు. ఇందుకోసం చాలా కష్టపడి పనిచేస్తుంటాడు. అయితే చెల్లళ్లు మాత్రం ఎవరి ఇష్టాలమేరకు.. లక్ష్యాల మేరకు ముందుకు వెళ్లాలని అనుకుంటారు. ఈ క్రమంలో గంగాధర్, అతని చెల్లెళ్లు ఎదుర్కొన్న కష్టాలు, వారు పంచుకునే భావాలు, బాధ్యతల సమాహారమే మా అన్నయ్య సీరియల్ కథ. ఈ సీరియల్ నుంచి రిలీజ్ అయిన ప్రోమోలతో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కుటుంబ నేపథ్యంలో రానున్న ఈ సీరియల్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. జీ తెలుగు ప్రేక్షకులను అలరించాలనే మరో డిఫరెంట్ స్టోరీని తీసుకురావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కథ ప్రేక్షకుల హృదయాలకు దగ్గరగా ఉంటుందన్నారు. మా అన్నయ్య సీరియల్ ప్రేక్షకులను తప్పక అలరిస్తుందనే నమ్ముతున్నామన్నాన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. లీడ్ రోల్‌లో నటిస్తున్న గోకుల్ మీనన్ మాట్లాడుతూ.. జీ తెలుగులో తాను నటిస్తున్న రెండో సీరియల్ ఇది అని తెలిపారు. మా అన్నయ్య సీరియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నారు. తనకు మంచి పాత్ర పోషించే అవకాశం వచ్చిందన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మాట్లాడుతూ.. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై ఆడియన్స్‌ను అలరించేందుకు భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆకట్టుకునే సీరియల్స్, కార్యక్రమాలతో విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు తమ పరిధిని విస్తరించేందుకు అద్భుతమైన వేదికను అందిస్తోందని చెప్పారు. భావోద్వేగభరితమైన కథతో రూపొందుతున్న మా అన్నయ్య సీరియల్ ద్వారా ఆడియన్స్‌ను అలరించేందుకు ఉత్సాహంగా ఉన్నామన్నారు. స్మాల్ స్క్రీన్‌లోనూ ప్రేక్షకులు తమను ఆదరించి.. ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామన్నారు.
మా అన్నయ్య సీరియల్ ప్రారంభంతో ఇతర సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. సోమవారం నుంచి శనివారం వరకు రాధమ్మ కూతురు సీరియల్ మధ్యాహ్నం 12 గం.కు, ఊహలు గుసగుసలాడే మధ్యాహ్నం 3 గం.కు, చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి సాయంత్రం 6 గం.కు ప్రసారమవుతాయి. రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ మార్చి 23వ తేదీతో ముగియనుంది.
Also Read: Kidnap Drama: 'ఇది బిగనర్స్ మిస్టేక్స్ చూసుకోవాలి కదా!'.. బెడిసికొట్టిన యువతి కిడ్నాప్ డ్రామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter