Zee Telugu TV: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందించేందుకు జీ తెలుగు సిద్ధమైంది. థియేటర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందకు వచ్చేస్తోంది.
Also Read: Movie Theatre: హీరో నానికి బిగ్ షాక్.. థియేటర్‌లో 'కోర్టు' సినిమా నిలిపివేత!
విజయ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ GOAT మార్చి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో స్ట్రీమ్ కానుంది. గాంధీ (విజయ్), స్పెషల్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (SATS) సభ్యుడు, మేనన్ (మోహన్) నేతృత్వంలోని టెర్రరిస్ట్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు కెన్యాలో ఒక మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకాక్‌లో ఒక మిషన్‌లో ఉన్నప్పుడు, గాంధీ తన కుమారుడు జీవన్ (విజయ్) మరణించినట్లు తెలుసుకుంటాడు. కానీ కొన్నాళ్ల తర్వాత రష్యాలో జీవన్‌ను సజీవంగా కలుసుకుంటాడు. జీవన్ నిజంగా గాంధీ కొడుకేనా? అతనికి మేనన్‌తో ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే GOAT సినిమా మిస్ కాకుండా చూసేయండి!
Also Read: KA Paul: 'నా ఆస్తులు కొట్టేయాలని కుట్ర'.. చంద్రబాబు, పవన్‌పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు
వెంకట్ ప్రభూ దర్శకత్వంలో తెరకెక్కిన GOAT సినిమా ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపుదిద్దుకుంది. కథ, కథనంతోపాటు నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో వెండితెర ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇంటిల్లిపాదిని అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో హీరో విజయ్ భిన్నమైన పాత్రలో నటించగా.. మీనాక్షి చౌదరి అందంగా కనిపించింది. స్నేహ, లైలా, మోహన్, ప్రశాంత్ తదితర నటీనటులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
GOAT సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ ఆదివారం GOAT సినిమాను మిస్ కాకుండా తప్పక చూడండి! ఇళయదళపతి విజయ్ సూపర్హిట్ సినిమా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఈ ఆదివారం మీ జీ తెలుగులో చూసి ఆనందించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









