Sa Re Ga Ma Pa Contestants: భారత సినీ సంగీతంలో జీ టీవీ నిర్వహిస్తున్న సరిగమప షో ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఈ షోకు చెందిన ఇద్దరు గాయనీలు అంతర్జాతీయ వేదికగా తళుక్కుమన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రపంచ వేదికపై జీ సరిగమప గాయనీలు అద్భుతంగా పాడి భారతీయత గొప్పతనాన్ని చాటి చెప్పారు. జీ సరిగమప 2024 పోటీదారులు శ్రద్ధా మిశ్రా, పార్వతి మీనాక్షి యూకేలో జరిగిన ప్రతిష్టాత్మక వేదికపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
Also Read: Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత హై కమిషన్ సహాయంతో జరిగిన వేడుకల్లో జీ సరిగమప కంటెస్టెంట్స్ పాటలతో అలరించారు. జనవరి 25వ తేదీన బీపీ పల్స్ బర్మింగ్‌హామ్‌లో, మరుసటి రోజు 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజు లండన్‌లోని ఓవోవో అరినా వెంబ్లీలో శ్రద్ధా మిశ్రా, పార్వతి మీనాక్షి ప్రదర్శన ఇచ్చారు. 'పరదేస్ - యే మేరా ఇండియా', 'కర్మ- దిల్ దియా హై జాన్ బీ దేంగే' పాటను ఎంతో హృద్యంగా పాడారు. సరిగమపకి వీరి ప్రదర్శన ఒక మైలురాయిగా నిలిచింది. ప్రఖ్యాత అంతర్జాతీయ వేదికలపై పోటీదారులను ప్రదర్శించిన మొదటి భారత టెలివిజన్ మ్యూజిక్ రియాలిటీ షోగా జీ సరిగమప నిలిచింది.
Also Read: Karmasthalam: పాన్ ఇండియా రేంజ్‌లో ‘కర్మ స్థలం’.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
పునీత్ గోయెంకా ఆధ్వర్యంలో జీ యూకే బిజినెస్ హెడ్ పరూల్ గోయెల్ చొరవతో కంటెస్టెంట్లు శ్రద్ధా మిశ్రా, పార్వతి మీనాక్షి అద్భుతమైన మైలురాయిని సాధించారు. పరుల్ గోయెల్ భారతదేశ వారసత్వాన్ని ప్రపంచ వేదికపై తీసుకురావడానికి చేసిన వ్యూహత్మక చర్చలు, అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైంది. బర్మింగ్‌హాల్, వెంబ్లీలోని ఈవెంట్ నిర్వాహకులతో చర్చించి సరిగమప కంటెస్టెంట్లతో ప్రదర్శన చేసేలా గోయెల్ విశేషంగా కృషి చేశారు. రెండేళ్ల కిందట సరిగమప యూకే కోసం రికార్డు స్థాయిలో 17 మంది స్పాన్సర్లను పిందడం ద్వారా జీ బ్రాండ్‌పై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, ప్రపంచ వేదికపై జీ ప్రాముఖ్యతను బలోపేతం చేసింది. యూకే పర్యటనలో శ్రద్ధ మిశ్రా, పార్వతి జనవరి 26వ తేదీన జరిగిన భారత హైకమిషన్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చారు.
అంతర్జాతీయ వేదికపై జీ సరిగమప కంటెస్టెంట్లు ప్రదర్శన చేయడంపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సీఈఓ పునీత్ గోయెంకా స్పందిస్తూ.. 'జీలో ప్రతిభను వెలికి తీయడం.. అడ్డంకులను అధిగమించడం, ప్రపంచ వేదికపై భారతీయ కళలు, సంస్కృతిని ప్రదర్శించడం ఆనందంగా ఉంది. లండన్‌లోని గణతంత్ర వేడుకల్లో.. భారత హై కమిషన్ సమక్షంలో, ఐకానిక్ వెంబ్లీ వేదికపై సరిగమప కంటెస్టెంట్లు ప్రదర్శన చేయడం మా లక్ష్యానికి చేరువ కావడమే' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









