close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

అభినేత్రి - 2 మన ముందుకు వచ్చేస్తోంది...!!

 ప్రభుదేవ,తమన్న జంటగా నటించిన  అభినేత్రి 2 తెలుగు తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Updated: May 21, 2019, 04:07 PM IST
అభినేత్రి - 2 మన ముందుకు వచ్చేస్తోంది...!!

అభినేత్రి హర్రర్ కామిడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకలను ఆకట్టుకున్న అభినేత్రికి సీక్వెల్‌గా వ‌స్తున్న అభినేత్రి 2 రిలీజ్ కు రెడీ అవుతోంది.  ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన ఈ మూవీ  మే 31న  రిలీజ్ చేస్తేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. 

 నందితా శ్వేత, స‌ప్త‌గిరి, సోనూసూద్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు కే.ఎల్. విజ‌య్ ద‌ర్శ‌కుడు. అభిషేక్ నామా, ఆర్‌. ర‌వీంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా తో పాటు నందితా శ్వేతా పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో హైలెట్ గా నిలవనుంది.

అభినేత్రి 1 తరహాలనే ఈ మూవీ కూడా  ప్ర‌తి ఒక్క‌రినీ వినోదాన్ని పంచుతుందన్నారు దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు.  థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే మ‌న‌సుకు  న‌చ్చే ఆహ్లాద‌క‌రమైన స‌న్నివేశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయని తెలిపారు.   శామ్ సంగీతం అంద‌రినీ త‌ప్ప‌క అల‌రిస్తుంది. ఆయంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుందని తెలిపారు.