ఒక్కటౌతున్న మరో జంట : ఆర్య - సాయేషా సైగల్ పెళ్లి ఫిక్స్ ?

తెరపై ఏర్పడిన బంధం కాస్త పెళ్లి వరకు వెళ్లింది

Last Updated : Feb 14, 2019, 01:13 PM IST
ఒక్కటౌతున్న మరో జంట : ఆర్య - సాయేషా సైగల్ పెళ్లి ఫిక్స్ ?

వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న మరో వర్థమాన నటులు ఒక్కటౌతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త  ప్రేమగా చిగురించడం.. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లిందట... ఆర్య- సాయేషాలు జీవితాంతం కలిసి జీవించేందుకు బాటలు వేసుకున్నారట. 

విలక్షమైన పాత్రలను చేస్తూ తమిళనాట  తన ప్రత్యేకతను చాటుకున్న ఆర్య...గ్లామరస్ కథానాయికగా గుర్తింపు పొందిన సాయేషా మధ్య సాగిన లవ్ స్టోరీ పెళ్లిదాక వెళ్లిందట.  వచ్చేనెలలో వీరి వివాహాన్ని జరిపించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. పెళ్లి ఏర్పాట్లలోనే కుటుంబ సభ్యులు బిజీగా వున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో హీరోయిన్  సామేషా.. ఆర్య ప్రేమలో పడినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. ఇదే క్రమంలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త గత కొన్ని రోజులుగా కోలీవుడ్లో షికారు చేస్తోంది. కాగా వీరి  ప్రేమకు అంగీకరించిన పెద్దలు వీరి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారట. అయితే వీరి పెళ్లి విషయంలో అఫిషియల్స్ ఎనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు

Trending News