Dear Uma: 'డియర్ ఉమ'ను సక్సెస్ చేయండి.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మూవీ టీమ్

Dear Uma Movie Pre Release Event: డియర్ ఉమ ఈ నెల 18న థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రతి ఒక్కరు థియేటర్స్‌లో చూసి మంచి విజయాన్ని అందించాలని చిత్రబృందం కోరింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 17, 2025, 08:05 PM IST
Dear Uma: 'డియర్ ఉమ'ను సక్సెస్ చేయండి.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మూవీ టీమ్

Dear Uma Movie Pre Release Event: పృథ్వీ అంబర్ హీరోగా.. తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటించిన మూవీ డియర్ ఉమ. సుమయ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తూ.. రచయితగా వ్యవహరించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించగా.. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వర్క్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ.. తాము కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు మీడియా ఎంతో సపోర్ట్ చేసిందన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ తాను చెప్పాల్సిదంతా సినిమాలో చెప్పేశారన్నారు. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారని.. తాను ఒకడగు ముందుకు వేసి సినిమాను నిర్మించానని చెప్పారు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకువచ్చామని.. ప్రతి ఒక్కరు చూసి మంచి విజయాన్ని అందించాలని కోరారు. 

Add Zee News as a Preferred Source

హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ .. డియర్ ఉమ సినిమాకు పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన దియా మూవీని అందరూ ఆదరించారని అన్నారు. మొదట్లో తెలుగు అర్థమయ్యేది కాదని.. ఇప్పుడు నేర్చుకుంటున్నానని చెప్పారు. సుమయ రెడ్డి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని.. అందరూ థియేటర్లలో చూడాలని కోరారు. 

దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ఈ సినిమా కోసం తమ టీమ్ అంతా చాలా కష్టపడిందన్నారు. తాను బుర్రకథ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశానని.. ఆ టైమ్‌లోనే సుమయ రెడ్డిని కలిశానని చెప్పారు. ఆ తరువాత ఇద్దరు ఓ షార్ట్ ఫిల్మ్‌కి కోసం పని చేశామన్నారు. కరోనా సమయంలో ఆమె ఓ కథ రాశారని.. అది తనకు చాలా నచ్చిందన్నారు. అలా డియర్ ఉమ సినిమా మొదలు పెట్టామన్నారు. ఈ కథను నమ్మి చాలా మందికి వద్దకు వెళ్లామని.. స్టోరీలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందన్నారు. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో సునయ రెడ్డి ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. తమ వెనుక ఎవరూ లేరని.. మీడియా, ప్రేక్షకులు సపోర్ట్ కావాలని కోరారు. డియర్ ఉమ తప్పకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు.

Also Read: Parijata Yog: 62 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పారిజాతయోగం.. ఈ రాశుల వారికి కలలో కూడా  ఊహించని జాక్ పాట్..! మీరున్నారా..?  

Also Read: Samantha: ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు..!..  షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత.. మ్యాటర్ ఏంటంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News