‘సైరా’ మూవీ; బిగ్ బి అమితాబ్ లుక్స్ రిలీజ్ 

                                       

Updated: Oct 11, 2018, 01:36 PM IST
 ‘సైరా’ మూవీ; బిగ్ బి అమితాబ్ లుక్స్ రిలీజ్ 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న151వ చిత్రం సైరా… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ రెడీ అవుతన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ అయింది. అమితాబ్ తన 76 వ   పుట్టిన రోజు  సెలెబ్రేట్  చేసుకుంటున్నసందర్భంలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం గమనార్హం.

చిరుకు గురు బిగ్ బి

ఈ సినిమాలో చిరంజీవికి గురువుగా నటిస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్... ‘గోసాయి వెంకన్న’ పేరు గల పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో కీలకమైన రోల్ లో చేస్తున్న బిగ్ బి లుక్స్ చూస్తే ఈ సినిమా స్టాండర్డ్స్ ఏ పాటిలో ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.

ఈ సినిమాలో  మెగాస్టార్ చిరంజీవి బ్రిటీష్ ప్రభుత్వం నుండి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మొటమొదటి భారతీయుడు ‘నరసింహారెడ్డి’ రోల్ లో నటిస్తున్నాడు. చిరు సరసన నయన తార యాక్ట్ చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.