close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బాయ్ ఫ్రెండ్‌తో అమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్

బాయ్ ఫ్రెండ్‌తో అమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్

Updated: May 6, 2019, 04:03 PM IST
బాయ్ ఫ్రెండ్‌తో అమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తళుక్కుమన్న ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్‌కి నిశ్చితార్థమైంది. ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనయిటోతో ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. నిశ్చితార్థం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా లండన్‌లో తమ సన్నిహిత మిత్రులకు ఈ జంట ఓ గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చింది. ఈ నిశ్చితార్థం సందడిలో జార్జ్ వైట్ అండ్ వైట్ సూట్‌లో కనిపించగా మోనోక్రోమ్ డ్రెస్‌లో అమీ జాక్సన్ ఆకట్టుకుంది.

2.0 సినిమాలో చివరిసారిగా కనిపించిన అమీజాక్సన్ ఆ తర్వాత సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకుంది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ని అని ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చిన అమీజాక్సన్.. ఇంకొంత కాలం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుందేమేననే టాక్ వినిపిస్తోంది.