Anaganaga Australia Lo Movie Review: జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్, జెడిఆర్ చెరుకూరి, రిషి ప్రధాన పాత్రల్లో తారక రామ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'అనగనగా ఆస్ట్రేలియాలో'. సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బీటీఆర్ శ్రీనివాస్ నిర్మించారు. నెవర్-సీన్-బిఫోర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను అలరించేందుకు నేడు (మార్చి 21) థియేటర్‌లలో సందడి మొదలు పెట్టింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో 83 వివిధ రకాల లొకేషన్లలో 122 రోజుల పాటు చిత్రీకరించారు. మరి ఈ మూవీ ఆడియన్స్‌ను మెప్పించిందా..? అంచనాలను అందుకుందా..? రివ్యూలో చూద్దాం పదండి.
సినిమాలో హీరో ఒక క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ.. చాలా సింపుల్‌గా బతుకుతుంటాడు. తన చదువు కోసం చిన్న చిన్న అసైన్‌మెంట్స్ రాస్తూ.. వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజులు కడుతుంది హీరోయిన్. ఈ నేపథ్యంలో ఓ రాజకీయ నేత తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఓ సీక్రెట్ కారణంగా సాధ్యం కాదు. ఆ రహాస్యాన్ని వెతికే తీసుకువచ్చేందుకు ఓ క్రిమినల్‌ను నియమిస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ తాను రాసిన అసైన్‌మెంట్ డబ్బులు తీసుకునేందుకు ఓ వ్యక్తి రూమ్‌కు వెళ్లబోయి.. క్రిమినల్ రూమ్‌కు వెళుతుంది. అక్కడ చిన్నగా కొన్ని సామాను దొంగిలిస్తుంది. అయితే ఆ రూమ్‌లోనే చాలా పెద్ద స్కామ్ జరుగుతుంటుంది. అలా తనకు తెలియకుండానే హీరోయిన్ కేసులో చిక్కుకుంటుంది.
ఫస్టాఫ్‌లో రహాస్యాన్ని వెతికే క్రమంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. హీరోయిన్ ఆ క్రైమ్‌లో ఎలా చిక్కుకునే సస్పెన్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. హీరో తన గ్రామాన్ని అభివృద్ధి కోసం మంచి పనులు చేస్తుంటాడు. గ్రామంలో ఓ స్కూలు కట్టాలని డబ్బు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నా.. అది ప్రమాదకరం కావడంతో తీసుకోవాలా..? వద్దా..? అనే కన్ఫ్యూజన్‌లో ఉంటాడు. చివరికి ఇది దొంగడబ్బు.. మంచి పనులకు ఉపయోగిస్తే తప్పేంటి అనుకుని.. ప్లాన్ అమలు చేస్తాడు. ఈ క్రమంలో అతను కూడా ఈ స్కామ్‌లో ఇరుక్కుపోతాడు. పరిస్థితులు చేజారిపోవడంతో దేశం విడిచి పారిపోదామని అనుకుంటారు. కానీ అసలు షాక్ అప్పుడే తగులుతుంది. వాళ్ల దగ్గరు ఉన్న డబ్బులు ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.
క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. హీరోయిన్ దొంగిలించిన డబ్బుల్లో ఓ మెమొరీ కార్డు ఉంటుంది. అందులోనే స్కామ్‌కు సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ రాజకీయ నాయకుడి కొడుకు ఎవరో తెలుసుకుని.. ఆ మెమొరీ కార్డును ఓ బ్రోకర్‌కు అమ్మి డబ్బులు తీసుకుంటారు. కానీ ఆ డబ్బులు కూడా స్కామ్ అవుతాయి. చివరికి హీరో, హీరోయిన్ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. హీరో మాస్టర్ ప్లాన్ వేసి.. పోయిన డబ్బులును మళ్లీ తెచ్చుకుంటాడు. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో మూవీ ముగుస్తుంది.
సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అలరిస్తుంది. కామెడీ, రొమాన్స్, స్కామ్ బ్యాక్‌డ్రాప్ అన్ని బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ కథను నడిపించారు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ అదిరిపోతుంది. సంగీతం, స్క్రీన్‌ప్లే సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. విజువల్స్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. అయితే అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయ్యాయి. కొన్ని సీన్స్ మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. స్కామ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కామెడీని ఆస్వాదించాలనుకునే వారికి ఈ మూవీ మంచి ఆప్షన్.
రేటింగ్: 2.75 /5
Also Read: Honey Trap: 'హనీ ట్రాప్ ఉచ్చు'లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎవరినీ వదలమని సీఎం హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









