అంచనాలు పెంచిన భారత్ ట్రైలర్

ఆకట్టుకుంటున్న భారత్ ట్రైలర్

Updated: Apr 22, 2019, 08:28 PM IST
అంచనాలు పెంచిన భారత్ ట్రైలర్
Source : Youtube@T-Series

సల్మాన్ ఖాన్ అప్‌కమింగ్ సినిమా భారత్ ట్రైలర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. దేశ భక్తి నేపథ్యంతో అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ ఏడాది రంజాన్ కానుకగా జూన్ 5న అభిమానుల ముందుకురానుంది. తన దేశం కోసం భారత్ ఎంత పాటుపడ్డాడనేదే ఈ సినిమా కథాంశం. దే సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిషా పటాని వంటి స్టార్ హీరో, హీరోయిన్స్‌తోపాటు సునీల్ గ్రోవర్ వంటి స్టార్ కమెడియన్స్ నటించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందనిపించేలా ఇవాళ విడుదలైన ట్రైలర్ కనిపించింది.

 

సల్మాన్ ఖాన్ హీరోగా సుల్తాన్, టైగర్ జిందా హై వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అలీ అబ్బాస్ జాఫర్ ముచ్చటగా మూడోసారి అతడితో చేసిన సినిమా ఇది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రలో నటించాడు. 2014లో వచ్చిన దక్షిణ కొరియా చిత్రం ఓడ్ టు మై ఫాదర్ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని అలీ అబ్బాస్ జాఫర్, వరుణ్ వి వర్మ రచించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్ బావ అతుల్ అగ్నిహోత్రి, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.