వైరల్ వీడియో: నిజమైన సైనికుడి నోట.. బార్డర్ మూవీ పాట

సైనికులు పడే వ్యధను ఆవిష్కృతం చేస్తూ అందరి గుండెల నిండి దేశభక్తిని నింపిన సినిమా బార్డర్. జేపీ దత్తా నిర్మించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సన్నిడియోల్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించగా.. జాకీష్రాఫ్, రాకీ గుల్జార్, టబు వంటి నటీనటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అను మాలిక్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్. అందరి గుండెల్లో దేశభక్తిని తట్టిలేపే ''సందేశే ఆతే హై.. హమే తడ్‌పాతే హై''.. ఈ సినిమాలోనిదే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు

Updated: Jan 11, 2019, 05:09 PM IST
వైరల్ వీడియో: నిజమైన సైనికుడి నోట.. బార్డర్ మూవీ పాట
Pic Courtesy:Twitter

దేశ సేవ చేస్తున్న వారిలో మొట్టమొదటి వరుసలో వుండే వాళ్లు ఎవరైనా వున్నారా అంటే అది కన్న తల్లిదండ్రులు, భార్య పిల్లలకు దూరంగా దేశ సరిహద్దుల్లో రేయింబవళ్లు దేశానికి కాపలాకాసే సైనికులే. శత్రు దేశం ఎప్పుడు, ఎక్కడ విరుచుకుపడుకుందా అనే భయం లేకుండా దేశంలో ప్రజలు నిశ్చింతగా ఉండగలుగుతున్నారంటే, ఆ క్రెడిట్ ముందుగా దేశ సైనికులకే చెందుతుంది. అటువంటి సైనికులు పడే వ్యధను ఆవిష్కృతం చేస్తూ అందరి గుండెల నిండి దేశభక్తిని నింపిన సినిమా బార్డర్. జేపీ దత్తా నిర్మించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సన్నిడియోల్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించగా.. జాకీష్రాఫ్, రాకీ గుల్జార్, టబు వంటి నటీనటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అను మాలిక్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్. 

అందరి గుండెల్లో దేశభక్తిని తట్టిలేపే ''సందేశే ఆతే హై.. హమే తడ్‌పాతే హై''.. ఈ సినిమాలోనిదే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు విన్నా, ఎప్పుడు విన్నా... మళ్లీ మళ్లీ వినాలని అనిపించే ఆ పాటను తాజాగా ఓ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సైనికుడు పాడి ఆకట్టుకున్నాడు. త్వరలోనే దేశంలో జరగనున్న గణతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశ సేవ చేస్తోన్న ఓ సైనికుడు పాడిన బార్డర్ మూవీ పాటకు సోషల్ మీడియా సైతం ఫిదా అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.