close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

స్పెషల్ ఎఫెక్ట్ కింగ్ ఏక్ నాథ్ ఇక లేరు, ఆయన సినీ ప్రస్థానం ఇదే..

సినీ పరిశ్రమ ఈ రోజు ఓ ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది

Updated: May 15, 2019, 08:27 PM IST
స్పెషల్ ఎఫెక్ట్ కింగ్ ఏక్ నాథ్  ఇక లేరు, ఆయన సినీ ప్రస్థానం ఇదే..

చలనచిత్ర పరిశ్రమలో స్పెషల్ ఎఫెక్ట్ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఏక్ నాథ్ (70) తుదిశ్వాస విడిచారు. చెన్నైలో నివాసముంటున్న ఆయన అనారోగ్యం కారణంగా కన్నుముశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఏక్ నాథ్ ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణకు సోదరుడు.

ఐదు దశాబ్దాల క్రితమే చెన్నైకి పయనం..

ఏక్ నాథ్ 55 ఏళ్ల క్రితమే మద్రాసుకు పయనై అక్కడే స్థిర పడ్డారు. ఎన్టీఆర్, అమితాబ్, రజనీకాంత్, కమల్హాసల్ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు ఆయన టెక్నీషియన్ పనిచేశారు. దేశంలోని అగ్ర హీరోల సినిమాలకు స్పెషల్ గ్రాఫిక్ అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 

కంప్యూటర్ లేకుండానే స్పెషల్ ఎఫెక్ట్

ఏక్ నాథ్ తన సుదీర్ఘ సినీ ప్రస్తానంలో 700 పైగా సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్ అందించారు. దీంతో పాటు అనేక త్రీడీ సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే చారిత్రక, జానపద చిత్రాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా రక్తికట్టించిన టెన్నీషియన్ గా  ఏక్ నాథ్  మంచి పేరు సంపాదించారు.  గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఏక్ నాథ్ ఈవెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 

ప్రముఖుల సంతాపం...

ఇదిలా ఉండగా ఏక్ నాథ్  మృతిపై టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags: