Criminal 123 Movie: తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన రాకాదన్ మూవీ.. క్రిమినల్ 123 పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. వంశీ కృష్ణ, రియాజ్ ఖాన్, దినేష్, కలాసి సెల్వన్, విజ్ఞేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను శ్రీ కనకదుర్గ పిక్చర్స్ బ్యానర్‌పై కె.హైమావతి నిర్మించారు. కె.గీత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మే మొదటి వారంలో థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమాకు దినేష్ కలై దర్శకత్వం వహించారు. ఎ.ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు. మానస్ బాబు సినిమాటోగ్రఫర్‌గా పనిచేయగా.. కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్ డైలాగ్స్ రాశారు. అతి త్వరలో సాంగ్స్, ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో కేజేఆర్ పిక్చర్స్ రామకృష్ణ, కిషోర్, జయబాబు రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
క్రైమ్ అండ్ యాక్షన బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్ అజ్మల్ పనిచేస్తుంటారు. ఆయన ముందుకు అర్జున్ అనే యువకుడి మర్డర్ కేసు వస్తుంది. అలెక్స్ అనే వ్యాపారి దగ్గర పని చేసే అర్జున్‌కు.. అతని చీకటి వ్యాపారాల గురించి తెలియడంతో హత్య చేసి ఉంటాడని అజ్మల్ భావిస్తాడు. అయితే ఓ బిగ్ ట్విస్ట్ చూసి షాక్ అవుతాడు. ఆ తరువాత అతను ఏం చేశాడు..? ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. స్నేహం, ప్రేమ, థ్రిల్లర్‌ల నేపథ్యంలో మోడలింగ్ ఇండస్ట్రీలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలలోని చీకటి కోణాలను డైరెక్టర్ తెరపై చక్కగా చూపించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.
Also Read: NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
Also Read: Indian Navy: పాక్ సరిహద్దుల్లో భారత నేవీ మిసైల్ ప్రయోగం.. యుద్ధనౌకల మోహరింపు వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









