close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

అమ్మాయిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి రానా !!

 హైదరాబాద్ లో జరిగిన జెర్సీ మూవీ  సక్సెస్ మీట్ లో దగ్గుబాటి రాణా అతిధిగా పాల్గొన్నారు

Updated: Apr 29, 2019, 06:13 PM IST
అమ్మాయిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి రానా !!

 జెర్సీ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చిన రాణా ఆకస్తికర వ్యాఖ్యాలు చేశారు. జెర్సీ మూవీ గురించి ప్రస్తావిస్తూ తనకు జీవింలో కొన్ని విషయాలు అర్ధం కావని..జీవితంలో తనకు క్రికెట్ తో పాటు అమ్మాయిలు, పెళ్లి, పెల్లలంటే అస్సలు అర్థం కారని చమత్కారించారు. అలాంటి తనకే జెర్సీలోని ఎమోషన్స్ కట్టిపడేశాయన్నారు. సాధారణ ప్రేక్షకులకు మరింత కట్టిపడేస్తుందన్నారు

అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు అన్నా పెద్దగా ఆసక్తి ఉండదన్న వ్యాఖ్యలకు యాంకర్ సుమ స్పందిస్తూ పెళ్లి, పిల్లల గురించి బాగా అర్థం కావాలని కోరుకుంటున్నాం అని చమత్కరించారు. వెంటనే రానా వచ్చి సుమ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు.  అది చూసి సుమ కంగారుపడిపోయి కాళ్లు వెనక్కి లాగేసుకున్నారు. రానా నుంచి తప్పించుకునేందుకు వేదికపై పరుగులు పెట్టారు. ఇది చూసిన ఆడియన్స్ నవ్వుకున్నారు.