Dear Uma Movie: ప్రేక్షకులు కొత్త కొత్త కంటెంట్ కలిగిన సినిమాలను మాత్రమే చూసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా లవ్, రొమాంటిక్, యాక్షన్ మూవీలను ఎక్కువగా చూస్తున్నారు. ఏది ఏమైనా ఆడియన్స్ మాత్రం సినిమాల్లో కొత్త పాయింట్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి తరహాలోనే కొత్త పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘డియర్ ఉమ’.. ఇది ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు హీరోయిన్‌తో పాటు నిర్మాత, రచయితగా సుమయ రెడ్డి ఆడియన్స్‌కి పరిచయం కాబోతున్నారు. ఈ మూవీని సుమయ రెడ్డి తమ సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించగా.. ప్రధాన పాత్రల్లో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ కనిపించబోతున్నారు.
అలాగే ఈ సినిమాకు ప్రొడ్యుసర్‌గా సుమయ రెడ్డి వ్యవహరిస్తుండగా.. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్ వ్యహరిస్తున్నారని సినీ బృందం తెలిపింది..అలాగే ఈ ‘డియర్ ఉమ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్యహరిస్తున్నారు. అలాగే చక్కటి మాటలతో పాటు దర్శకత్వంతో సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు బాధ్యతలు నిర్వర్తించారు.. ఈ మూవీకి సంగీతాన్ని రదన్ అందించారు. ఇప్పటికీ ఎన్నో సక్సెస్ సినిమాలకు సంగీత దర్శకుడి పని చేశారు. ఇక విజువల్స్ వివరాల్లోకి వెళితే.. కెమెరామెన్‌గా మంచి పేరున్న రాజ్ తోట అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు.
ఇప్పటికే ఈ డియర్ ఉమ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌తో పాటు పాటలు, టీజర్స్ విడుదలై.. ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా తెసిందే.. అయితే ఫీల్ గుడ్ ఎమోషనల్‌తో రాబోతున్న ఈ సినిమా లవ్ స్టోరీతో చూడబోతోన్నామని ఇప్పటికే విడుదలైన కంటెంట్ ద్వారా తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మంచి ప్రేమ కథను చూసే అవకాశం దక్కబోతోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని కూడా తాజాగా సినిమా బృందం ప్రకటించింది.
ఈ సినిమా అద్భుతమైన ప్రేమ కథతో మంచి సందేశాన్ని కూడా అందింబోతున్నట్లు తెలుస్తంది. ఈ మూవీని ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ మూవీ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాతో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









