Dear Uma Movie Release: సుమయ రెడ్డి హీరోయిన్‌గా నటిస్తున్న ‘డియర్ ఉమ’ చిత్రం విడుదల తేది ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 18వ తేదిన విడుదల కాబోతున్నట్లు అధికారికంగా చిత్ర బృదం వెల్లడించింది. ఈ సినిమాకి నిర్మాతగా, రచయితగా సుమయ రెడ్డి విశేషం. అయితే ఈ మూవీకి ప్రొడ్యూసర్స్‌గా నగేష్, నితిన్ రెడ్డి వ్వవహరిస్తున్నారు. దీనికి మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను సాయి రాజేష్ వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్నో మూవీస్‌కి అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అలాగే అద్భుతమైన మ్యూజిక్‌ను అందించేందుకు రదన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే డియర్ ఉమ చిత్రం నుంచి పోస్టర్లు, గ్లింప్స్, పాటలు కూడా విడుదలయ్యాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను చాలా వరకు పెంచింది. ఈ టీజర్ ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేశారు. అంతేకాకుండా టీజర్ చాలా ఆసక్తిగా ఉండడం వల్ల చిత్రయూనిట్ అభినందించారు. అలాగే ఈ సమయంలో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఈ డియర్ ఉమ టీజర్ చాలా నచ్చిందని.. ప్రేమ కథతో మంచి సందేశం అందించే ఫీల్ గుడ్ మూవీ కాబోతున్నట్లు తెలిపారు.
ఈ టీజర్ ముందుగా అద్భుతమైన డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రేమ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అలాగే ప్రత్యేకమైన ఎమోషనల్ డైలాగ్ అందరినీ ఆకర్శిస్తోంది. ఈ టీజర్‌లో ఉండే డైలాగులు హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ను తెలియజేయడమే కాకుండా సమాజానికి అద్భుతమైప సందేశాన్ని అందిస్తుంది. త్వరలోనే విడుదల కాబోయే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర యునిట్ ఆశభావం వ్యక్తం చేస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









