ముస్లిమైనా.. హిందూ పద్ధతిలోనే భార్య శ్రాద్ధకర్మలు చేయాలనుకున్నాడు

కోల్‌కతా ప్రాంతానికి చెందిన ఇమ్తియాజుర్ రెహమాన్ దంపతులు గత కొంతకాలంగా ఢిల్లీలో నివాసముంటున్నారు. రెహమాన్ భార్య నివేదిత ఘాటక్ ఓ హిందూ స్త్రీ. ఇటీవలే ఆమె మరణించారు. అయితే మరణించే ముందు తన శ్రాద్ధకర్మలు హిందూ సంపద్రాయం ప్రకారమే చేయాలని ఆమె కోరారట. అందుకోసం స్థానిక కాళీ మందిర్ సొసైటిని సంప్రదించారు రెహమాన్. 

Updated: Aug 11, 2018, 12:51 AM IST
ముస్లిమైనా.. హిందూ పద్ధతిలోనే భార్య శ్రాద్ధకర్మలు చేయాలనుకున్నాడు
Image: Pixabay

కోల్‌కతా ప్రాంతానికి చెందిన ఇమ్తియాజుర్ రెహమాన్ దంపతులు గత కొంతకాలంగా ఢిల్లీలో నివాసముంటున్నారు. రెహమాన్ భార్య నివేదిత ఘాటక్ ఓ హిందూ స్త్రీ. ఇటీవలే ఆమె మరణించారు. అయితే మరణించే ముందు తన శ్రాద్ధకర్మలు హిందూ సంపద్రాయం ప్రకారమే చేయాలని ఆమె కోరారట. అందుకోసం స్థానిక కాళీ మందిర్ సొసైటిని సంప్రదించారు రెహమాన్. అయితే అందుకు ససేమిరా కుదరదని తెలిపారు సొసైటీ నిర్వాహకులు. రెహమాన్ తన భార్య దహన సంస్కారాలు కూడా హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించారు. అయితే శ్రాద్ధకర్మల విషయంలోనే తనకు చుక్కెదురైంది. రెహమాన్ తన మతం గురించి తెలపకుండా.. సొసైటీ వారిని సంప్రదించి ఏర్పాట్లు చేయమన్నారని ఆరోపణలు చేశారు కాళీ మందిర్ నిర్వాహకులు అసితవ బౌమిక్.

బౌమిక్ మాట్లాడుతూ "కాళీ మందిర్‌ని తన భార్య శ్రాద్ధకర్మల నిర్వహణ కోసం ఓ వ్యక్తి సంప్రదించారు. అందుకోసం ఆగస్టు 12వ తేది స్లాట్‌ని తన కుమార్తె పేరు మీద బుక్ చేయించారు. అయితే మాకు ఆ తర్వాత అనుమానమొచ్చి ఆయన గోత్రాన్ని అడిగాం. అప్పుడే ఆయన ముస్లిం అనే విషయం మాకు తెలిసింది. ఒక ముస్లింను వివాహం చేస్తుకున్న హిందూ స్త్రీ కూడా ముస్లిం అనే మా అభిప్రాయం. అందుకే ఆమెకు శ్రాద్ధకర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు మేము ఒప్పుకోలేదు" అని బౌమిక్ తెలిపారు.  

అయితే ఈ విషయంలో రెహమాన్ వాదన వేరేగా ఉంది. తాను, నివేదిత ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. కానీ తమ మధ్య మత ప్రసక్తి ఎప్పుడూ రాలేదని ఆయన అన్నారు. తన భార్య తన హిందూ మతాచారాల ప్రకారమే ఇంట్లో పూజలు చేసుకున్నా.. తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని రెహమాన్ అన్నారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అసిస్టెంటు కమీషనరుగా పనిచేసిన రెహమాన్ ప్రస్తుతం తన భార్య శ్రాద్ధకర్మలు జరిపించడానికి ప్రత్యమ్నాయ పద్ధతుల కోసం ఆలోచిస్తున్నారు.