Different Movie: ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు. మంచి కథకు కామెడీ ట్రాక్‌తో డిఫరెంట్‌గా తెరకెక్కిస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఇలా ఓ సరికొత్త ప్రయోగంతో రూపొందిన మూవీ 'డిఫరెంట్'. డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో హలీవుడ్ స్థాయిలో వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎన్‌ఎస్‌వీడీ శంకరరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జి.ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ ఆర్.భాస్కర్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా.. నిహల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇండస్ట్రీలో బెస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ స్టాండెడ్స్‌తో సూపర్బ్ విజువల్స్ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎన్.ఎస్.వి.డి శంకరరావు మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశామని చెప్పారు. కథ, కంటెంట్ బాగుంటే.. ఏ సినిమాను అయినా ఆడియన్స్ హిట్ చేస్తారని అన్నారు. అదేతరహాలో డిఫరెంట్ మూవీని రూపొందించామన్నారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి మంచి విజయాన్ని అందించాలని కోరారు. ఎస్‌కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
Also Read: Snake Bite: పాముకాటు వేసిన వెంటనే నెయ్యితో ఈ పొడిని కలిపి రుద్దండి.. విషం వ్యాపించదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









