Ra Raja Movie: ఆర్టిస్టులు లేకుండా సినిమా.. క్రేజీ ఆలోచనతో రా రాజా మూవీ

Ra Raja Movie: నటీనటుల మొహాలు చూపించకుండా తొలిసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రా రాజా మూవీ రాబోతుంది. ఈ సినిమాకు బి.శివ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 6, 2025, 06:53 PM IST
Ra Raja Movie: ఆర్టిస్టులు లేకుండా సినిమా.. క్రేజీ ఆలోచనతో రా రాజా మూవీ

Ra Raja Movie: ఇప్పటివరకు అనేక ప్రయోగాత్మక సినిమాలు వచ్చాయి. కానీ తొలిసారి ఆర్టిస్టుల మొహాలు చూపించకుండా ఓ సినిమా రాబోతుంది. ఇప్పటివరకు ఎవరూ చేయని సాహాసం డైరెక్టర్ బి.శివ ప్రసాద్ చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న సినిమా ‘రా రాజా’. శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు. బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌ పనిచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. రేపు (మార్చి 7) ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత బి.శివ ప్రసాద్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

Add Zee News as a Preferred Source

మాతృ సినిమాతో తాను ప్రొడ్యూసర్‌గా మారానని.. ఆ సినిమా సమయంలోనే తనకు ఈ ‘రా రాజా’ స్టోరీ ఐడియా వచ్చిందన్నారు. తానే నిర్మాతగా.. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించానని తెలిపారు. ప్రేక్షకులు ప్రస్తుతం హీరోహీరోయిన్స్ పేర్లు, వారి మొహాలు చూసిన థియేటర్‌కు రావడం లేదని.. కథ నచ్చి.. కంటెంట్ బాగుంటేనే వస్తున్నారని అన్నారు. అలా కంటెంట్ బేస్డ్‌గా.. కథా ప్రాధాన్యమున్న సినిమా తీయాలని తాను అనుకున్నట్లు చెప్పారు. అలా అనుకుని రా రాజా సినిమాను ప్రారంభించినట్లు చెప్పారు. 

ఈ మూవీలో ఆర్టిస్టులు ఎవ్వరూ కనిపించకపోయినా అన్ని రకాల ఎమోషన్స్‌తో రూపొందించామన్నారు శివ ప్రసార్. అన్ని రకాల ఎమోషన్స్‌ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా తెరకెక్కించామని.. ప్రేమ, కామెడీ, హారర్ ఇలా ప్రతీ ఒక్కటీ ఉంటుందన్నారు. ఆడియన్స్‌ను ఆద్యంతం అలరించేలా.. చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు టెక్నికల్ టీం బలం అని.. కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ వల్లే  సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం అని..  BGM సినిమాకు ప్లస్ అవుతుందని అన్నారు.

థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఈ సినిమాను రూపొందించామన్నారు. చాలా కష్టపడి సినిమా తీశామని.. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. నటీనటుల మొహాలు కనిపించడం లేదని భావన మాత్రం కలగదన్నారు. తాము చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. 

Also Read: Old Pension Scheme: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ బొనాంజా.. ఓపీఎస్‌పై కీలక ప్రకటన..!

Also Read: Rashmika Mandanna Video: అయ్యారే... నేషనల్ క్రష్‌కు ఘోర అవమానం.. ఏకంగా స్టేజీ మీదనే గుండు చేసి మరీ.. !... వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News