close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

కాలికి గాయమైందని స్వయంగా వెళ్లి చికిత్స చేయించుకున్న శునకం !!

కాలికి గాయం అయిందని ఫార్మసీకి శునకం స్వయంగా వెళ్లి చికిత్స చేయించుకుంది

Updated: Jun 25, 2019, 01:08 PM IST
కాలికి గాయమైందని స్వయంగా వెళ్లి చికిత్స చేయించుకున్న శునకం !!

మనకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా..ఆరోగ్యం క్షీణించినా వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్తాం. అదే జంతువులు ఏం చేస్తాయి. పాపం నొప్పిని భరించడం తప్పితే మరేం చేయలేని పరిస్థితి. తన బాధను మససు విప్పి వేరొకరికరితో పంచుకోలే మూగజీవులు. అయితే అందుకు భిన్నంగా ఓ శునకం ఏం చేసిందో తెలుసా.. తానే స్వయంగా వెళ్లి తన బాధను చెప్పుకొని చికిత్స చేయించుకుంది. 

ఇంతటితో ఆగిపోయిందా అంటే పొరపాటే ..తనకు వైద్యం సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు కూడా చెప్పింది. సరే దీనికి ఎవరైనా ట్రనింగ్ ఇచ్చారా అంటే అదీ లేదు. అది సాధారణ వీధి కుక్కు. అసలు ఈ శునకానికి ఇన్ని తెలివితేటలా వచ్చాయా అని ఆశ్చర్యం వేస్తుంది కదూ..అవును మరి..! సరే శనకం ఏ విధంగా చికిత్స చేయించుకుందో చూడండి మరి...

 

 

ఇస్తాంబుల్ దేశంలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  ఓ వీధి కుక్క కాలికి దెబ్బ తగిలింది...  వెంటనే అది దగ్గర్లోనే  ఫార్మసీకి వెళ్లింది. చికిత్స చేయాలని దీనంగా మొహం పెట్టేసరికి.... దీని పరిస్థితి చూసిన అదే దుకాణంలోని కాపలా కుక్క వస్తే దానికి విషయం చెప్పింది.

ఇది గమనించిన దుకాణం యజమాని వచ్చి ఏం జరిగిందన్నట్టు చూస్తే తన కాలిని పైకెత్తి చూపింది. విషయాన్ని అర్ధం చేసుకున్న అతను దానికి చికిత్స చేయగా వెళుతూ వెళుతూ ఆ శునకం కృతజ్ఞతలు కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. ఈ శునకానికి ఇన్ని తెలివితేటలా ? అంటూ ప్రతీ ఒక్కరు ఆశ్చరంగా చూస్తున్నారు. 

Tags: