Tribanadhari Barbarik: సత్య రాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ త్రిబాణధారి బార్భరిక్. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. వానర సెల్యూలాయిడ్ బ్యానర్పై విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీమ్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో వస్తోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్లతో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఫీల్ గుడ్ సాంగ్ కూడా ఆడియన్స్ను తెగ అలరిస్తోంది.
'అనగా అనగా కథలా అంటూ..' అంటూ సాగే ఈ సాంగ్లో టీకేఆర్ కాలేజ్లో విద్యార్థుల సమక్షంలో కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు కార్తిక్ గానం అందించగా.. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన హృద్యమైన బాణీ హృదయాలను హత్తుకుంటోంది. సనరే రాసిన సాహిత్యం అందించారు. తాతయ్య-మనవరాలి మధ్య అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు.
ఈ సందర్భంగా సత్య రాజ్ మాట్లాడుతూ .. టీకేఆర్ కాలేజీ విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. 14 వేల మంది విద్యార్థుల మధ్య సాంగ్ను విడుదల చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు వస్తుందని.. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలని కోరారు. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. తన మొదటి హీరో సత్య రాజ్ అవ్వడం తన అదృష్టమని అన్నారు. 170 చిత్రాల్లో హీరోగా చేసిన ఆయనతో కలిసి తాను పని చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే సినిమా థియేటర్లలో సందడి చేస్తుందన్నారు.
టెక్నికల్ టీమ్:
==> బ్యానర్ : వానర సెల్యూలాయిడ్
==> రైటింగ్ & డైరెక్టర్: మోహన్ శ్రీవత్స
==> ప్రొడ్యూసర్ : విజయపాల్ రెడ్డి అడిదల
==> సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
==> ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజేష్ నంబూరు
==> లైన్ ప్రొడ్యూసర్ : బి.ఎస్. రావు
==> DOP: కుశేందర్ రమేష్ రెడ్డి
==> మ్యూజిక్: ఇంఫ్యూజన్ బ్యాండ్
==> ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
==> ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నాస్
==> ఫైట్స్ : రామ్ సుంకర
==> కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
==> PRO : సాయి సతీష్









