close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తన గ్యాంగ్ తో తెరపైకి వచ్చిన నేచురల్ స్టార్ !!

గ్యాంగ్ లీడన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు

Updated: Jul 16, 2019, 02:54 PM IST
తన గ్యాంగ్ తో తెరపైకి వచ్చిన నేచురల్ స్టార్ !!

గ్యాంగ్ లీడర్ ఎవరో తెలిసింది.. ఇదే సమయంలో లీడర్ వెనుక ఉన్న గ్యాంగ్ ఎవరో తేలిపోయింది. విక్రమ్‌ డైరెక్టన్ లో  నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న గ్యాంగ్ లీడర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఇంతకాలం గ్యాంగ్ గురించి సస్పెన్స్ గా ఎలిమెంట్స్ లీక్ చేసినట్లయింది.

బామ్మ.. వరలక్ష్మి.. ప్రియ.. స్వాతి.. చిన్ను..అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని నాని విడుదల చేశారు. పోస్టర్ లో అయిదుగురు భిన్న వయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నాని తో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ తో ఈ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లో ఉన్నదెవరో రివీల్ చేశారు.

ఈ ఐదుగురికి గ్యాంగ్ లీడర్ గా నాని ఇందులో కనిపించబోతున్నాడు. ఇక ఫస్ట్ సాంగ్ ని జులై 18 న, టీజర్ ని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ ను ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30 న విడుదల చేస్తారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్నాడు.

http://akamai.vidz.zeecdn.com/zeecinemalu/2019/07/nani-gang-leader-2.jpg