close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ప్రేమ కోసం కత్తి పట్టిన సాఫ్ట్ కుర్రాడు ; గుణ 369 కంటెంట్ లీక్ !!

అర్జున్ జంధ్యాల డైరక్షన్ లో  కార్తికేయ హీరోగా నటిస్తున్న గుణ 369 మూవీ కంటెంట్ విషయంలో సస్పెన్స్ కు తెరపడింది.

Updated: Jul 17, 2019, 01:57 PM IST
ప్రేమ కోసం కత్తి పట్టిన సాఫ్ట్ కుర్రాడు ; గుణ 369 కంటెంట్ లీక్ !!

అర్జున్ జంధ్యాల డైరక్షన్ లో  కార్తికేయ హీరోగా నటిస్తున్న గుణ 369 మూవీ విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. ఇందులో కంటెంట్ ఎలా ఉండబోందనే దానిపై ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేసింది చిత్రయూనిట్. లవ్ & యాక్షన్ సబ్జెక్ట్ ఎలిమెట్స్ సమతూకంగా ఉంటాయని తేల్చేశారు. ఇదే విషయాన్ని  ట్రయిల్ ద్వారా లీక్ చేశారు . తాజాగా రిలీజ్ అయిన గుణ 369 ట్రయిలర్ చూసి ఎంజాయ్ చేయండి మరి.

 

మూవీ ట్రయిలర్ రివ్యూ...
మూవీ ట్రయిల్ విషయానికి వస్తే సాఫ్ట్ గా ఉండే ఓ కుర్రాడు, తన ప్రేమ కోసం హింసామార్గాన్ని ఎంచుకున్నాడనే విషయం ట్రయిలర్ తో అర్థమైంది. ఓ సెల్ ఫోన్ స్టోర్ లో పనిచేసే అమ్మాయిగా అనఘ నటించింది. హీరోయిన్ వల్ల హీరో కత్తిపట్టాల్సి వచ్చిందనేది గుణ369 కాన్సెప్ట్. ఓ టైమ్ లో హీరో జైలుకు కూడా వెళ్లాడనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు. అలా గుణ 369 అనే టైటిల్ వెనక సస్పెన్స్ ను రివీల్ చేశారు.

అర్జున్ జంధ్యాల డైరక్టర్ గా తొలి సినిమా 
ఆర్ఎక్స్ 100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కార్తికేయ.. తన రెండో సినిమా కోసం పూర్తిగా లవ్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకొని బోల్తా కొట్టాడు. అందుకే తన మూడో సినిమాకు మాత్రం చాలా కేర్ తీసుకున్న కార్తీకేయ...లవ్ & యాక్షన్ సబ్జెక్ట్ ఎలిమెట్స్ సమతూకంగా ఉండేలా చూసుకున్నాడు. ఇక మిగిలిన విషయాలను పరిశీలించినట్లయితే బోయపాటి వద్ద డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. జ్ఞాపికా ఎంటర్టైన్ మెంట్స్ , ఎస్జీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల కలిసి ఈ సినిమాను నిర్మించారు. చైతన్ భరధ్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయబోతున్నారు.