close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

అందమైన ఓ తెలుగమ్మాయి వేటలో అఖిల్ !!

బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అక్కినేని అఖిల్ సరికొత్త ప్రాజెక్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

Updated: Jun 18, 2019, 04:08 PM IST
అందమైన ఓ తెలుగమ్మాయి వేటలో అఖిల్ !!

తెలుగు తెరపై తనదైన స్టయిల్ లో దూసుకెళ్తున్న అక్కినేని అఖిల్ కొత్త ప్రాజెక్టుకు ఓకే అనేశాడు. ఈ సారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు.  ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు... రెగ్యులర్ షూట్ కు మాత్రం డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 26 నుంచి అఖిల్ నాలుగో సినిమా సెట్స్ పైకి రాబోతోందని టాక్.

హీరోయిన్ ఎంపికలో బిజీ బీజీ

అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ఇప్పడు హీరోయిన్ ఎంపికలో చిత్ర యూనిట్ బిజీ బీజీ గా ఉంది. హీరోయిన్ విషయంలో తెలుగు అమ్మాయిని అఖిల్ ప్రిఫర్ చేస్తున్నట్లు టాక్..దీంతో అఖిల్ సరసన నటించేందుకు ఓ అందమైన తెలుగమ్మాయి వేట మొటలెట్టారు చిత్ర యూనిట్. మరి అఖిల్ సరన నటించే ఆ గోల్డెన్ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో మరి.

హీరోయిన్ లేకుండానే షూటింగ్

ప్రస్తుతం కొత్తమ్మాయిలతో పాటు లైమ్ లైట్ లో ఉన్న హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ మేటర్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. అయితే దీంతో సంబంధం లేకుండా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యారు. హీరోయిన్ తో సంబంధం లేని షాట్స్ అన్నీ అఖిల్ పై పూర్తిచేయాలని నిర్ణయించారు.
 

Tags: