బొమ్మరిల్లు 'సిద్ధూ' టాలీవుడ్ రీ ఎంట్రీ..కానీ కొంచెం టైం కావాలట !!

బొమ్మరిల్లు సినిమాతో లవర్ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్ధార్ధ్ మల్లీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాడు

Last Updated : May 2, 2019, 06:41 PM IST
బొమ్మరిల్లు 'సిద్ధూ' టాలీవుడ్ రీ ఎంట్రీ..కానీ కొంచెం టైం కావాలట !!

మంచి ప్రేమ కథ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల చేరువైన హీరో సిద్ధార్థ్ గుర్తున్నాడు కదూ. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ ఇప్పుడు కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. టాలీవుడ్ సినిమాలకి దాదాపు బై బై చెప్పేడని ఫ్యాన్స్ డిసైడ్ అయిన సమయంలో... సిద్ధూ లేటెస్ట్ గా తెలుగు ఓ ప్రామిస్ చేసాడు. తాను మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానని.. అందుకు కొంచెం టైం కావాలని కోరాడు.

వివరాల్లోకి వెళ్లినట్లయితే ట్విట్టర్ వేదికగా హీరో సిద్ధార్థ్ కు  ఓ అభిమాని ...ఇక కోలీవుడ్ కే పరిమితమా అనే పశ్నకు వేశాడు. దీనికి సిద్ధూ  “ఎవరు ఏమన్నా నేను తిరిగి వస్తాలే… మీకు ప్రామిస్ చేస్తున్నా కేవలం 18 నెలలు టైం ఇవ్వండి ప్రేక్షకులారా, గ్రేట్ కంటెంట్ తో వస్తున్నా…మాట్లాడుకుందాం” అంటూ బదులిచ్చాడు

ఉన్నపళంగా సిద్దు ఇలా తెలుగు సినిమా గురించి ట్వీట్ చేయడంతో సిద్దు తెలుగు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . అయితే ఈ లవర్ హీరో తెలుగులో మళ్ళీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? దానికి 18 నెలలు ఎందుకు..? అనేవి పక్కనపెడితే… సిద్దార్థ్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.

Trending News