LAMP Movie Updates: రాజశేఖర్ రాజ్ దర్శకత్వంలో వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీ రావు ప్రధాన పాత్రలు పోషిస్తున్న మూవీ ల్యాంప్. చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై GVN శేఖర్ రెడ్డి నిర్మించగా.. ఎస్.జనార్థన్ రెడ్డి, పి.నవీన్ కుమార్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 14న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ సందర్బంగా హీరో, నిర్మాత వినోద్ నువ్వుల మీడియాతో ముచ్చటించారు. ల్యాంప్ సినిమా విశేషాలను పంచుకున్నారు.
లాంప్ మూవీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని.. వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఛేదించే క్రమంలో హీరో ప్రయాణం ఎలా సాగింది..? అనే విషయాన్ని కామెడీ యాంగిల్‌లో చూపిస్తూ చివరికి ఏం జరిగింది అనేది సినిమా కథ అని చెప్పారు వినోద్ నువ్వుల. తాను ఒక కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటానని.. ఆ కేసులను సాల్వ్ చేసి ఫైనల్‌గా ఇన్‌స్పెక్టర్ అవడం తన క్యారెక్టర్ అని తెలిపారు. ఓ వైపు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే.. కామెడీ పండించడం తన పాత్రకు హైలెట్ అని అన్నారు. రాకేష్ మాస్టర్ నటించిన చివరి సినిమా ఇదేనని చెప్పారు.
వినోద్ ఫిల్మ్ అకాడమీ గురించి చెప్పుకొస్తూ.. చాలామంది స్టూడెంట్స్ సినిమాల్లో నటించాలనే ఆశతో వచ్చి మోస పోతున్నారని అన్నారు. ఏమి నేర్చుకోకుండా వెళ్లి ఇబ్బందులు పడటం కంటే.. తమ వద్ద నేర్చుకుని గైడెన్స్‌లో వెళితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు. తమ అకాడమీలో నేర్చుకున్న విద్యార్థులకు అవకాశాలు చూపించి.. వాళ్లు కట్టిన ఫీజు రెమ్యూనరేషన్ రూపంలో సంపాదించుకునే విధంగా గ్యారంటీ ఇస్తుంటామన్నారు. ఆడియన్స్ ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్నారని.. వారి అభిరుచికి తగినట్లు తాను కొత్త రకంగా నటిస్తున్నానని తెలిపారు.
ప్రస్తుతం తాను బార్బరీక్ అనే సినిమా చేస్తున్నానని.. త్వరలో విడుదల కానుందన్నారు వినోద్ నువ్వుల. శాసనమా.. చట్టమా.. అనే సినిమాలో హీరో సుమన్ కొడుకు పాత్ర పోషిస్తున్నానని.. మరో రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆడియన్స్ చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అనేది తేడా లేకుండా ఏ సినిమా నచ్చితే ఆదరిస్తున్నారని అన్నారు. తమ ల్యాంప్ సినిమా కూడా అదే రకంగా హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. సినిమా గ్రాఫిక్స్ పనుల కారణంగా కాస్త ఆలస్యమైందని.. థియేటర్స్‌లోనే విడుదల చేయాలనే ఉద్దేశంతో సినిమాను రూపొందించామన్నారు. ట్రైలర్ నచ్చడంతో డిస్ట్రిబ్యూటర్లే తమకు ఎదురు డబ్బులు ఇచ్చి మరి సినిమా విడుదల చేస్తామన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా సినిమా టికెట్ ధర 110 రూపాయలుగా నిర్ణయించామన్నారు. ప్రేక్షకులు పెట్టిన డబ్బులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామన్నారు.
Also Read: Snake Viral Video: కోడి గుడ్డును మింగి నరకం చూసిన పాము.. చివరకు ఏమైందంటే..?.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









