సాహో ‘బ్యాడ్ బాయ్’సాంగ్ పై భారీ ఎక్సెపెక్టేషన్స్ !!

 సాహోలో ప్రభాస్, జాక్విలిన్ పెర్నాండెజ్ మధ్య హాట్ హాట్ సెక్సీ స్టెప్స్‌తో సాగిన బ్యాబ్ బాయ్ సాంగ్ కుర్రకారును కాక రేకెత్తించేలా ఉంది.  

Last Updated : Aug 20, 2019, 12:42 PM IST
సాహో ‘బ్యాడ్ బాయ్’సాంగ్ పై భారీ ఎక్సెపెక్టేషన్స్ !!

సాహో ‘బ్యాడ్ బాయ్’సాంగ్ పై ఫాన్స్ లో భారీ ఎక్సెపెక్టేషన్స్ నెలకొన్నాయి. బాలీవుడ్ నటి జాక్లిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులేసిన ఈ పాట ప్రభాస్ ని మోస్ట్ స్టైలిష్ బ్యాడ్ బాయ్ గా ప్రెజెంట్ చేస్తుంది. అయితే ఈ సాంగ్ వెనక సినిమాలో ఇంకేదో హై పాయింట్ ఖచ్చితంగా ఉంటుందనే ఫీలింగ్.. ఫ్యాన్స్ లో ఉంది. 

దానికి రీజన్ ఈ సినిమాలే… 
బాహుబలి ( మనోహరి ) ఈ సాంగ్ కి కనెక్ట్ అవ్వని ఆడియెన్స్ ఉండరు. ట్యూన్స్ దగ్గరి నుండి విజువల్స్ వరకు ప్రతీది అమేజింగ్ అనిపించుకున్నదే. అలాగే అంతకుముందు‘మిర్చిలాంటి కుర్రాడు…’ అంటూ కుర్రాడు ప్రభాస్ మ్యానరిజాన్ని ఎలివేట్ చేసే సాంగ్. హీరో ఒక పర్టికులర్ ప్లానింగ్ తో ఊరికి వస్తున్నప్పుడు దారి వెంబడి ఉండే సాంగ్. ఓ రకంగా సినిమా చూస్తున్న ఆడియెన్స్ కి, ఇప్పటి వరకు ఓ లెక్కా.. ఇకనుండి ఓ లెక్కా.. అనే ఫీల్ ని జెనెరేట్ చేయడానికే సాంగ్ అనిపిస్తుంది.  ఇక ఏక్ నిరంజన్ విషయానికి వస్తే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి అసలు కథకి సంబంధమే లేదు. ఓ పర్టికులర్ సిచ్యువేషన్ లో మైకేల్ జాసన్ కి ట్రిబ్యూట్ గా ఉంటుందీ సాంగ్… విజువల్స్ ఉన్నా.. కథకి అస్సలు సంబంధం ఉండదు. ఇందులో హీరో ఒక్క స్టెప్పు వేయడు..అయినా ఆడియన్స్ కు మాత్రం తెగ కనెక్ట్ అయిపోయింది. ఇలా చూసుకుంటూ పోతే ప్రభాస్ మూవీలో ఏదో ఒక బ్యాడ్ బాయ్ సాంగ్ ..ఏదో రకంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతూనే ఉంది.

ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా ?
ఇక పాస్ట్ నుంచి ఒక్క నిమిషయం బయటి వచ్చి  ప్రజంట్ లోని అడుగుపెడితే  సాహో ‘బ్యాడ్ బాయ్’సాంగ్ పై కూడా ఫాన్స్ లో  గత సినిమాల మాదిరి కంటే భారీ  ఎక్సెపెక్టేషన్స్  ఉన్నాయి. మరి ఫాన్స్ అంచనాలను ఎంత వరకు రీచ్ అవుతుందనేది వేచిచూడాల్సి మరి. కాగా ఈ నెల 30న విడుదల అవుతున్నసాహో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచారం జోరు పెంచింది. ‘సాహో’ నుంచి బ్యాడ్ బాయ్ అనే ఓ గ్లామరస్ సాంగ్‌ని ట్రైలర్ ను విడుదల చేశారు. చూసి ఎంజాయ్ చేయండి.

 

Trending News