వారేవ్వా క్యా బాత్ హై ; బాహుబలి సీన్ చూసిన హాలీవుడ్ డైరక్టర్ రియక్షన్ ఇదే

Last Updated : Aug 8, 2019, 07:19 PM IST
వారేవ్వా క్యా బాత్ హై ; బాహుబలి సీన్ చూసిన హాలీవుడ్ డైరక్టర్ రియక్షన్ ఇదే

బాహుబలి -2  సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నప్పటికీ ఇంకా ఎదో రకంగా దాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన ఈ మూవీలోని ప్రతి సీన్ చెప్పుకోదగిందే. అయితే ఈ మూవీలో హైలెట్ గా నిలిచిన ఓ సీన్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. గుర్తు కొచ్చిందా..అదేనండి ...ప్రభాస్‌ (బాహుబలి), సత్యరాజ్‌ (కట్టప్ప) తో పాటు మరికొందరు సైనికులు చెట్టుపై నుంచి ఎగిరి కోటలోకి ప్రవేశించే సన్నివేశం గుర్తుందా ? అది సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్ ఎంతలా ఆకుట్టుందంటే... ఈ మూవీలోని ఈ  సీన్ గుర్తు చేసుకుంటూ హాలీవుడ్ చెందిన ప్రముఖ డైకర్టర్  స్కాట్‌ డెరిక్సన్‌ దీనిపై ట్వీట్ చేశాడు. 

మొదలైందిలా ..

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ మూవీ లోని ఆ క్లైమాక్స్ చూసిన ఓ నెటిజన్  ఇలాంటి సన్నివేశాన్ని తన జీవితంలో ఎన్నడూ చూడాలేదని ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్ ఎటాచ్ చేసిన వీడియోను ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్కాట్‌ డెరిక్టర్  కంటబడింది.  ఈ సన్నివేశాన్ని ఆయనకు కూడా తెగ ఆకట్టుకోవడంతో. ‘ఇండియన్‌ బాహుబలి 2’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లంతా ‘బాహుబలి’ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి వారందరికీ నచ్చిన ఆ సీన్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి మరి.

 

 

Trending News