TikTok user`s airwalker dance : టిక్ టాక్ యూజర్ డ్యాన్స్ చూసి షాక్ అయిన హృతిక్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ ఎంత అద్భుతంగా చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అతడి సినిమాలు చూసిన వారికి ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు.. హృతిక్ రోషన్ సినిమా విడుదలవుతుందంటే.. కేవలం అతడి డ్యాన్స్, యాక్టింగ్ చూడ్డానికి థియేటర్ల వద్ద బారులుతీరే అభిమానులు కూడా కోకొల్లలు.

Last Updated : Jan 14, 2020, 10:50 PM IST
TikTok user`s airwalker dance : టిక్ టాక్ యూజర్ డ్యాన్స్ చూసి షాక్ అయిన హృతిక్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ ఎంత అద్భుతంగా చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అతడి సినిమాలు చూసిన వారికి ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు.. హృతిక్ రోషన్ సినిమా విడుదలవుతుందంటే.. కేవలం అతడి డ్యాన్స్, యాక్టింగ్ చూడ్డానికి థియేటర్ల వద్ద బారులుతీరే అభిమానులు కూడా కోకొల్లలు. అటువంటి హృతిక్ రోషన్ ఓ టిక్ టాక్ యూజర్ చేసిన డ్యాన్సింగ్ వీడియో చూసి ఫిదా అయ్యాడు. ఎయిర్‌వాకర్ స్టైల్లో ఆ కుర్రాడు చేసిన డ్యాన్సింగ్ వీడియో చూస్తే నిజంగానే ఎవరికైనా ఆ కుర్రాడు మన కళ్లను ఏమైనా మాయ చేసి మోసం చేస్తున్నాడా ? అని అనిపించకమానదు. పాదాలను చకచకా కదుపుతూ గాల్లో తేలిపోయినట్టుగా స్టెప్పులేస్తున్న కుర్రాడి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఓ ట్విటర్ యూజర్ ఆ వీడియోను హృతిక్ రోషన్‌తో పాటు ప్రభుదేవాకు ట్విటర్‌లో ట్యాగ్ చేశాడు. సదరు యువ డ్యాన్సర్‌ని పాపులర్ చేయాల్సిందిగా కోరాడు.

సదరు నెటిజెన్ కోరినట్టుగానే తనకు ట్యాగ్ చేసిన ఆ వీడియో చూసిన హృతిక్ రోషన్.. ఇంత స్మూత్‌గా ఎయిర్‌వాకర్ చేస్తుండగా చూడటం ఇదే మొదటిసారని.. అసలు ఎవరు ఇతను అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. టిక్ టాక్ వీడియోపై ఉన్న ప్రొఫైల్‌ని పరిశీలిస్తే.. మైఖెల్ జాక్సన్ మూన్ వాక్ చేసినంత ఈజీగా ఎయిర్‌వాకింగ్ చేస్తున్న ఈ కుర్రాడు తన పేరును బాబా జాక్సన్ 2020 అని పెట్టుకున్నాడు. అయితే, అతడి అసలు పేరు యువరాజ్ సింగ్ అని.. అతడికి టిక్ టాక్‌లో దాదాపు ఓ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఏదైతేనేం.. హృతిక్ రోషన్ కంట్లో పడిన తర్వాత యువరాజ్ సింగ్ దొరక్కుండా ఉంటాడా ? అతడి కెరీర్ ఇక ఎక్కడికో వెళ్లిపోయినట్టే అంటున్నారు నెటిజెన్స్.

Trending News