Tollywood News: యువతను ఆకట్టుకునేందుకు మరో డిఫరెంట్ లవ్ స్టోరీ రానుంది. భాను డైరెక్షన్‌లో IBM ప్రొడక్షన్ హౌస్‌పై కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు మెసేజ్ ఒరియెంటెడ్, సామాజిక స్పృహతో సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ భాను.. తొలిసారి తన పంథాను మార్చుకుని ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను రూపొందిస్తున్నారు. సరికొత్త ప్రేమకథను ఆడియన్స్‌కు పరిచయం చేయనున్నారు. 49 రోజులు నాన్ స్టాప్‌గా షూటింగ్ నిర్వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జూన్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యువతను ఆకట్టుకునే ఐదు సూపర్ సాంగ్స్ ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు.
దాదాపు 75 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఓ అబ్బాయి, తెలుగు అమ్మాయి ఈ మూవీలో జంటగా నటించారు. ఓ పెద్ద సంగీత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కొత్త టాలెంటెడ్ రైటర్.. ఈ సినిమాకు డైలాగ్స్ రాశారు. ఈ మూవీలో నటించిన ఇతర నటీనటుల పేర్లను, టెక్నీకల్ టీమ్ వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించానున్నారు. IBM ప్రొడక్షన్ హౌస్ సంస్థలో ప్రొడ్యూసర్ కనకదుర్గారావు పప్పుల ఎక్కడా రాజీ పడకుండా నిర్మించినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
Also Read: CM Chandrababu: పది నెలల పాలనలో సీఎం చంద్రబాబు ఫెయిలయ్యారా? పాసయ్యారా?
Also Read: YS Sharmila: కోడి గుడ్లు, టమోటాలతో దాడి.. వైఎస్ షర్మిల ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









