అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం స్పెషల్: టాప్ 5 బాలీవుడ్ "కిస్సింగ్" సీన్స్ ఇవే..!

ముద్దంటే చేదా.. అన్నారెవరో మహానుభావుడు. కానే కాదు. ఆలుమగల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య మురిపాల ముచ్చట్లను పంచేది ముద్దు మాత్రమే. అలాంటి ముద్దులకు కూడా ఓ రోజుంది. అదే అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం.

Updated: Jul 6, 2018, 04:49 PM IST
అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం స్పెషల్: టాప్ 5 బాలీవుడ్ "కిస్సింగ్" సీన్స్ ఇవే..!

ముద్దంటే చేదా.. అన్నారెవరో మహానుభావుడు. కానే కాదు. ఆలుమగల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య మురిపాల ముచ్చట్లను పంచేది ముద్దు మాత్రమే. అలాంటి ముద్దులకు కూడా ఓ రోజుంది. అదే అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం. మరి ఈ రోజు సందర్భంగా మీకో స్పెషల్ ఫీచర్ ఇది. బహుచక్కని ముద్దు సీన్లకు బాలీవుడ్ పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్ని మీకోసం ప్రత్యేకం..!

సాహెబ్, బీబీ ఔర్ గ్యాంగస్టర్: ఈ చిత్రంలో మహిగిల్, రణదీప్ హుడాల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. వారి మధ్య వచ్చే సీన్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుట్ టాప్ కిస్సింగ్ సీన్స్‌లో మాత్రం వీటికి కచ్చితంగా ప్రథమ స్థానం ఇవ్వవచ్చు. 

 

కి అండ్ కా: కి అండ్ కా చిత్రంలో అర్జున్ కపూర్, కరీనా కపూర్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అన్నీ కూడా బాగా క్లిక్ అయ్యాయి. ప్రేయసీ, ప్రియులుగా వారకనబరిచిన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రంలో పలు వచ్చే కిస్సింగ్ సీన్స్ కూడా ఎంతో రొమాంటిక్ అని చెప్పుకోవచ్చు. 

 

జిందగీ నా మిలేగీ దొబారా: ఈ చిత్రంలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్‌ల మధ్య వచ్చే కిస్సింగ్ సీన్స్‌ను మోస్ట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్స్‌గా పలు సినిమా పత్రికలు పేర్కొనడం విశేషం. పైగా ఈ చిత్రంలో వారి కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. 

 

దిల్ దడక్ నేదో: ఈ చిత్రంలో అనుష్క శర్మ, రణ్ వీర్ సింగ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా రొమాంటిక్‌గా ఉంటాయి. అందులో సందేహమే లేదు. 

ఆగ్ కా గోలా: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు 1990ల్లో వచ్చిన ఈ చిత్రంలో సన్నీ డియోల్, అర్చనా పురన్ సింగ్ మధ్య వచ్చే ప్రేమభరితమైన సన్నివేశాలకు రొమాంటిక్ ప్రియులు బ్రహ్మరథం పట్టారు.