close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై దాడి అతడి పనేనా ?

జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై దాడి అతడి పనేనా ?

Updated: Jul 20, 2019, 11:37 PM IST
జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై దాడి అతడి పనేనా ?

జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై కొంతమంది దుండగులు జరిపిన దాడిలో అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వినోద్‌పై దాడి గురించి తెలుసుకున్న తోటి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, సాంకేతిక సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని అతడిని పరామర్శించారు. కష్టకాలంలో జబర్దస్త్ టీమ్ అంతా వినోద్‌కి అండగా నిలిచింది. వినోద్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసేందుకు ఆస్పత్రికి చేరుకున్న ఆర్టిస్టులు.. వినోద్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ సాయి, శాంతి స్వరూప్ మాట్లాడుతూ.. వినోద్‌పై దాడిని జబర్దస్త్‌ టీమ్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. వినోద్‌కి ఇంటిని అమ్మేందుకు అతడి వద్ద డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకున్న ఇంటి ఓనరే అతడిపై హత్యాయత్నం చేశాడని ఆరోపించిన సాయి.. ఇంటి ఓనర్‌కి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు అగ్రిమెంట్ పత్రాలు, అందుకు సంబంధించి ఆధారాలు, సాక్షాలు అన్నీ ఉన్నాయన్నారు. ఎలాగైనా వినోద్‌ని హతమార్చాలని ఇంటి ఓనర్ కుట్ర పన్నాడని సాయి ఆరోపించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జబర్ధస్త్ ఆర్టిస్టులు డిమాండ్ చేశారు.