Yamudu Movie Poster: మైథలాజికల్ పాయింట్‌ను సరికొత్త విధానంలో చూపిస్తే సినిమాలు బ్లాక్‌బాస్టర్ అవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలోనే జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న యముడు మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై ధర్మో రక్షతి రక్షితః అనే ఉప శీర్షికతో ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లతో ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ పవర్ ఫుల్‌గా ఉంది. యుముడి రూపంలో జగదీష్ అందరినీ భయపెట్టించేలా కనిపించారు. వెనకాల మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఇలా అన్నీ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసేలా ఉన్నాయి. పోస్టర్‌ను చూస్తుంటే మూవీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. హీరోయిన్‌ను యమపాశంతో కట్టి పడేసిన తీరు ఆకట్టుకుంటోంది. యముడి ఆహార్యంలో రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే అనేలా హీరో లుక్ ఉంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న యముడు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.
నటీనటులు: జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు
టెక్నీకల్ టీమ్:
==> బ్యానర్ : జగన్నాధ పిక్చర్స్
==> స్టోరీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్: జగదీష్ ఆమంచి
==> రైటర్ : హరి అల్లసాని, జగదీష్ ఆమంచి
==> స్క్రీన్ ప్లే : శివ కుండ్రపు
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రజిని ఆమంచి
==> ఎడిటర్ : కెసిబి హరి
==> DOP: విష్ణు రెడ్డి వంగా
==> మ్యూజిక్ : భవాని రాకేష్
==> PRO : సాయి సతీష్
Also Read: NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
Also Read: Indian Navy: పాక్ సరిహద్దుల్లో భారత నేవీ మిసైల్ ప్రయోగం.. యుద్ధనౌకల మోహరింపు వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









