కలెక్షన్స్ లో సత్తా చాటుతున్న జెర్సీ; మిలియన్ డాలర్లు కొల్లగొట్టేసింది

నానీ కెరీలో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జెన్సీ భారీగా కలెక్షన్లు రాబడుతోంది

Last Updated : Apr 24, 2019, 08:55 PM IST
కలెక్షన్స్ లో సత్తా చాటుతున్న జెర్సీ; మిలియన్ డాలర్లు కొల్లగొట్టేసింది

నాని హీరోగా నటించిన జెర్సీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని జెర్సీకి ఓవర్సీస్ లో 10 లక్షల డాలర్లు వచ్చాయి. అంటే మిలియన్ డాలర్లకు రీచ్ అయిందన్న మాట.
నానీ కెరీర్ లో మరో బిగ్ హిట్
జెర్సీ సినిమాతో నాని ఖాతాలో చేరిన మిలియన్ డాలర్ క్లబ్ మూవీస్ సంఖ్య 6. ఇంతకుముందు ఈగ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, నేను లోకల్, నిన్నుకోరి సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. వీటిలో నాని కెరీర్ లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా భలే భలే మగాడివోయ్. ఆ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ ను మరో 3 రోజుల్లో క్రాస్ చేయబోతోంది జెర్సీ.
తెలుగు రాష్ట్రాల్లోనూ దూకుడు..
ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జెర్సీ సినిమా స్ట్రాంగ్ గా నడుస్తోంది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని నైజాంలో ఈ సినిమా 6 కోట్ల మార్క్ (షేర్) అందుకుంది. మరో 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంది

Trending News