కాంచన-3 మరో రికార్డు ; టాప్-5 జాబితాలో స్థానం

ప్రపచం వ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న కాంచన 3 మూవీ మరో మైలు రాయిని చేరుకుంది

Last Updated : May 1, 2019, 01:20 PM IST
కాంచన-3 మరో రికార్డు ; టాప్-5 జాబితాలో స్థానం

లారెన్స్ మూవీ కాంచన-3 సినిమా మరో రికార్డు సృష్టించింది. ఇటీవలె వంద కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకున్న  ఈ మూవీ .. తాజాగా ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సౌత్ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. విడుదలైన 11 రోజుల్లో వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించి..ఇప్పుడు ఇలా 2019 టాప్-5 మూవీస్ లిస్ట్ లో ఎంటరైంది. 

కాంచన-3 కంటే ముందు వంద కోట్ల క్లబ్ లో పేట, విశ్వాసం, ఎఫ్-2, లూసిఫర్ సినిమాలున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ఇది లూసిఫర్, ఎఫ్-2 వసూళ్లను క్రాస్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

లారెన్స్ కెరీర్ లో చూసుకుంటే ఇది రెండో వంద కోట్ల చిత్రం. గతంలో కాంచన-2 మూవీ కూడా వంద కోట్లు కలెక్ట్ చేసింది. కాగా కోలీవుడ్ లో ఈ ఏడాది వంద కోట్లు గ్రాస్ సాధించిన మూడో సినిమాగా కాంచన-3 నిలిచింది. 
 

Trending News