close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

గాన కోకిల ఎస్.జానకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ సింగర్ జానకి ప్రమాద వశాత్తు జారీ పడ్డారు

Updated: May 4, 2019, 08:26 PM IST
గాన కోకిల ఎస్.జానకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

కోకిల లాంటి తన ముధరమైన వాయిస్ తో ప్రేక్షక లోకానికి పరిచయమై.. అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ప్రముఖ గాయని (81)కి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం  మైసూరులోని ఆమె బంధువుల ఇంటికి వచ్చిన జానకి ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయారు. 

గాయంతో ఇబ్బంది పడుతున్న ఆమెను స్థానికంగా ఉండే ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.  ఆమె తుంటి భాగంలో పగులు కనిపించినట్టు వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనపై ఆమె బంధువులు స్పందిస్తూ ఘటన తర్వాత జానకి భరించలేనంత నొప్పితో బాధపడుతుండడంతో బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.