హీరోయిన్ కాజల్ మెడను చుట్టేసిన కొండచిలువ !!!

                                                

Updated: Oct 4, 2018, 06:07 PM IST
హీరోయిన్ కాజల్ మెడను చుట్టేసిన కొండచిలువ !!!

 టాలీవుడ్ హీరోయిన్ కాజల్ మెడను ఓ భారీ కొండచిలువ చుట్టేసింది. అయినప్పటికీ కాజల్ ఏమాత్రం అధైర్యపలేదు.. థాయ్‌లాండ్‌ పర్యటనలో తనుకు ఎదురైన ఓ అనుభవాన్ని కాజల్ .. అభిమానులతో పంచుకుంది.. కాజోల్ - కొండచిలువ కథ గురించి ఒక్కసారి తెలుసుకుందామా...?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతున్న  చిత్రం ఘూటింగ్ కోసం ఆమె థాయ్ లాండ్ వెళ్లారు. ఈ  సినిమాలో కాజల్ మెడలో కొండ చిలువ ఉన్న సీన్ ఒకటి ఉంది.. ఈ చిత్రీకరణలో భాగంగా కాజల్‌ మెడలో ఓ భారీ కొండచిలువను వేశారు. భారీ కొండ చిలువను చూసి తొలుత కంగారుపడ్డపప్పిటికీ .. సీన్ పూర్తి చేయాలని కాబట్టి ఎలాగోలా ధైర్యం చేసి కొండ చిలువను పట్టుకొని మెడలో వేసుకున్నారు. ఆ సమయంలో తీసిన ఆ వీడియోను  ‘ఇదొక గొప్ప అనుభూతి’ అని క్యాప్షన్ ఇచ్చి.. కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కాగా సోషల్ మీడియాలో ఈ విడియో తెగ వైరల్ అవుతోంది.. ఈ వీడియో చూసి మీరూ ఎంజాయ్ చేయండి.

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

WHAT AN EXPERIENCE

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

హీరోయిన్ కాజల్ కొండ చిలువను తన మోడలో వేసుకున్న సమయంలో ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి.. కాజల్‌ నువ్వు పాము స్పర్శను గ్రహించగలుగుతున్నావా ? అని అడిగారు...  కాజల్‌ సమాధానమిస్తూ  ‘ యస్.. నాకు దాని కండరాల కదలిక తెలుస్తోంది... బుసలు కొడుతున్న విషయం కూడా తెలుస్తోందని చెప్పింది.