చెన్నై: దక్షిణాది ఓ ఆంగ్ల దినపత్రిక ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018’ అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ క‌న‌బ‌రుస్తున్న ద‌క్షిణాది లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ను ఎక్స్ లెన్స్ అవార్డుతో స‌త్కరించింది. చెన్నైలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ సంద‌ర్భంగా న‌య‌నతార మాట్లాడుతూ, తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక తనకు కాబోయే భర్త విఘ్నేశ్‌ శివన్‌ని ప్రస్తావిస్తూ అత‌డికి కూడా కృతజ్ఞతలు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా న‌య‌నతార తన‌కు కాబోయే భ‌ర్త విఘ్నేశ్‌ శివన్‌ అంటూ ప్రక‌టించడం ఇదే తొలిసారి. ఈ ఇద్దరూ గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. నాన్‌మ్‌ రౌడీ ధాన్ ‌(తెలుగులో నేనూ రౌడీనే) చిత్ర షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె చెప్పినప్పటికీ వారి మధ్య రిలేషన్‌షిప్‌ గురించి తర్వాత చాలా కథనాలే వచ్చాయి.


న‌య‌న‌తార‌-విఘ్నేశ్‌ శివన్‌ల వివాహం ఈ ఏడాది చివ‌రిలో జ‌ర‌గ‌నుంద‌ని టాక్. ప్రస్తుతం న‌య‌న‌తార తెలుగులో సైరాలో న‌టిస్తుండ‌గా, త‌మిళంలో అర‌డ‌జ‌నుకు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి.