సరికొత్త ప్రయోగం; నయనతార డ్యూయల్ రోల్

                                               

Last Updated : Mar 18, 2019, 09:02 PM IST
సరికొత్త ప్రయోగం; నయనతార డ్యూయల్ రోల్

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయనతార సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. తొలి సారిగా ద్విపాత్రాభిన‌యం ప్రయోగంతో తెరపైకి కనిపించేందుకు సిద్ధమైంది. 

మేకప్ లేని పాత్రలో తార..

తెరపైకి వచ్చేందుకు సిద్ధమైన `ఐరా` మూవీలో నయనతార డ్యూయల్ రోల్ లో నటించింది. ఈ మూవీలో భవాని, యమున అనే రెండు పాత్రల్లో కనిపించబోతోంది నయనతార. ఇందులో భవాని పాత్ర డీ-గ్లామరస్ గా ఉండబోతోంది. ఈ క్యారెక్టర్ కోసం నయనతార మేకప్ లేకుండా నటించిందట. హారర్-థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది ఐరా సినిమా.

రెండో పాత్ర కోసం...

ఈ సినిమాలో రెండో పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ పాత్ర ఛాయలు, కథ ప్రకారం, భవాని పాత్రను కూడా నయనతారే చేస్తే బాగుంటుందని యూనిట్ ఫీల్ అయింది. నయన్ కూడా వెంటనే ఒప్పుకుంది. అలా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసింది నయన్. 

రిలీజ్ కోసం రెడీ

నయనతార డ్యూయల్ రోల్ లో నటించిన `ఐరా` ఈ నెల 28న  విడుద‌ల కానుంది. స‌ర్జున్ డైరెక్షన్ లో గంగా ఎంట‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ  తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. డ్యూయల్ రోల్ లో నయనతారను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Trending News