
Purushaha Movie Title Poster: ఇటీవల కామెడీ ప్రధానంగా వస్తున్న సినిమాలను ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కామెడీ వర్కౌట్ అయితే చాలు.. లాజిక్స్ లేకపోయినా సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ‘పురుష:’ అనే సినిమా రాబోతోంది. పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. వీరు ఉలవల దర్శకత్వంలో రూపొందుతోంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి.
ముహుర్తానికి వడ్డవల్లి వెంకటేశ్వర రావు(బుల్లబ్బాయ్) క్లాప్ కొట్టగా.. బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో, పోస్టర్‌ను విడుదలచ చేశారు. బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిగా మారుతుందనే లైన్స్‌తో సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా సతీష్ ముత్యాల పని చేస్తుండగా.. సంగీత దర్శకుడిగా శ్రవణ్ భరద్వాజ్ పని చేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు కోటి నిర్వహిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి.గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టెక్నికల్ టీమ్:
==> బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
==> సమర్పణ : బత్తుల సరస్వతి
==> ప్రొడ్యూసర్ : బత్తుల కోటేశ్వరరావు
==> డైరెక్టర్ : వీరు ఉలవల
==> మ్యూజిక్ డైరెక్టర్ : శ్రవణ్ భరద్వాజ్
==> కెమెరామెన్ : సతీష్ ముత్యాల
==> ఎడిటర్ : కోటి
==> PRO : సాయి సతీష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి