close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

అనుష్క '' నిశ్శబ్దం'' ఎలా ఉంటదో తెలుసా ?

 '' నిశ్శబ్దం'' మూవీ లో అనుష్క శెట్టి  ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Updated: Sep 11, 2019, 02:24 PM IST
అనుష్క '' నిశ్శబ్దం'' ఎలా ఉంటదో తెలుసా  ?

బాహుబలి హీరోయిన్ అనుష్క శెట్టి మెయిన్ రోల్ లో నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజయింది. సినిమాలో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. ఈ సినిమా టైటిల్ ని  గతంలోనే  అనౌన్స్ చేసిన మేకర్స్... ఈ రోజు ఈ పోస్టర్ తో పాటు అనుష్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది రివీల్ చేశారు. షార్ట్ హెయిర్ లుక్స్ లో కాన్వాస్ పై పెయింట్ చేస్తూ కొత్తగా కనిపిస్తుంది అనుష్క.

అనుష్క ముందు ఛాలెంజ్ !!
‘నిశ్శబ్దం’ కథ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్సే.. కానీ సినిమాలో అనుష్క పేరు ‘సాక్షి’ ని బట్టి, సినిమాలో జరిగే ఒక ఇన్సిడెంట్ కి అనుష్క క్యారెక్టర్ కనెక్ట్ అయి ఉంటుందని తెలుస్తుంది. దానికి తోడు క్యారెక్టర్ కి ఉండబోయే స్పెషల్ క్వాలిటీస్, సినిమాలో మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జెనెరేట్ చేస్తాయనిపిస్తుంది. ఇవన్నీ గమనిస్తే అనుష్కకి ఇప్పటికే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేసిన అనుభవం ఉన్నా, ‘నిశ్శబ్దం’ మాత్రం అనుష్క కరియర్ లోనే మోస్ట్ చాలెంజింగ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అనుష్క '' నిశ్శబ్దం'' ఏ మేరకు వర్కవుట్ అవుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.