
O Andala Rakshasi Pre Release Event: షెరాజ్ మెహదీ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న మూవీ ఓ అందాల రాక్షసి. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్స్‌గా యాక్ట్ చేయగా.. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించారు. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 21న ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రానుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథను తీసుకువచ్చి కచ్చితంగా చేయాలని చెప్పారని.. రెమ్యూనరేషన్ ఎక్కువ వదిలేస్తారని అనుకున్నానని అన్నారు. అయితే తాను అడిగినంత డబ్బు ఇచ్చారని.. తన కెరీర్లో ఇంత మొత్తం చూసింది మొదటిసారి చెప్పారు. ఈ సినిమా కథ చాలా బాగుందని.. ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
హీరో, డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు క్రమశిక్షణతో సినిమాలు చేస్తూ వచ్చానని.. ఇకపై కూడా అలానే చేస్తూ ఉంటానని చెప్పారు. ఈ సినిమా థియేటర్లలోకి రానంతవరకే చిన్న మూవీ అని.. థియేటర్లోకి వచ్చిన తరువాత దాని రేంజ్ ఏంటో తెలుస్తుందన్నారు. టీమ్ అంతా కలిసి ఈ సినిమాను ఒక కుటుంబంలా పూర్తి చేశామన్నారు. మార్చి 21న ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయాలని కోరారు. భాష్య శ్రీ మాట్లాడుతూ.. తాము కథ చెప్పిన వెంటనే తమ్మారెడ్డి ఎంతో ఎగ్జైట్ అయ్యారని.. ఎంతో అండగా నిలబడ్డారని అన్నారు. అందరూ ఈ సినిమాను చిన్న సినిమా అనుకుంటారని.. రిలీజ్ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు.
నేహా దేశ్ పాండే మాట్లాడుతూ .. అమ్మాయిలు తమపై జరిగే మోసాలు దాడులను ఎలా ఎదుర్కోవాలనే పాయింట్‌ను ఈ సినిమాలో చక్కగా చూపించారని అన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. కృతి వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్న వెంటనే తనకు గూస్ బంప్స్ వచ్చాయని.. తనకు ఈ సినిమా నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. స్క్రీన్‌పై కనిపించాలనే కల తనకు ఈ సినిమాతో నెరవేరిందన్నారు. విహాన్షి హెగ్డే మాట్లాడుతూ.. మహిళల సమస్యలపై తీసిన ఈ మూవీ అందరిని మెప్పిస్తుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి