డియర్ ''కామ్రేడ్‌''కు ఒకవైపు ప్రసంశలు.. మరో‌ వైపు నిరసనలు !!

 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన అట్టహాసంగా రిలీజైనా డియర్ కామ్రేడ్ మూవీ క్షేత్ర స్థాయిలో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది.

Last Updated : Jul 27, 2019, 11:43 AM IST
డియర్ ''కామ్రేడ్‌''కు ఒకవైపు ప్రసంశలు.. మరో‌ వైపు నిరసనలు !!

సూపర్ హిట్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ తెరకెక్కించిన ''డియర్ కామ్రేడ్'' మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది కూడా అట్టహాసంగా రిలీజ్ అయింది. తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఒక పక్క భారీ వసూళ్లు రాబడుతూనే మరో వైపు నుంచి నిరసన సెగ ఎదుర్కొంటుంది..విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చినందుకేనా ?

''డియర్ కామ్రేడ్''  ఈ మూవీని తెలుగుతో దక్షిణాది అన్ని భాషల్లో శుక్రవారమే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కన్నడ నాట ...కన్నడ వెర్షన్‌ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ థియేటర్లను కేటాయించారు. సరిగ్గా ఇదే అంశం వివాదానికి..నిరసనకు కారణమైంది. కన్నడ ప్రాంతంలో తెలుగు వెర్షన్‌కే ఎక్కువ ధియోటర్ల కేటాయించడంపై  ఆగ్రహించిన కన్నడిగులు... తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లగక్కారు. అంత మాత్రానా ఇక్కడ  కన్నడ వెర్షన్‌కు ఎందుకని ప్రశ్నించారు. తెలుగు వెర్షన్‌నే ఇక్కడ విడుదల చేయొచ్చు కదా..అలకబూనారు. 

ట్వీట్టర్ వేదికపై నిరసనలు..!!

ట్విట్టర్ వేదికపై కన్నడియులు డియర్ ''కామ్రేడ్‌''పై  ట్వీట్ల వర్షం కురిపించారు.  కన్నడిగులపై తెలుగును రుద్దడం ఆపండి అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి బాయ్‌కాట్ డియర్ కామ్రేడ్ అంటూ హ్యాష్‌ట్యాగ్ పెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్య చిత్ర నిర్మాలు ఎలాంటి పరిష్కారం చూపిస్తారనేది వేచిచడాల్సి ఉంది.

Trending News