close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

సైరా స్పెషల్: అన్నయ్య మూవీకి తమ్ముడి వాయిస్ !!

సైరా మూవీకి వాయిస్ ఓవర్ అందించేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు.

Updated: Aug 16, 2019, 01:37 PM IST
సైరా స్పెషల్: అన్నయ్య మూవీకి తమ్ముడి వాయిస్ !!

అన్నయ్య మూవీకి తమ్ముడు సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. మెగాస్టార్ మూవీ సైరా నరసింహారెడ్డి మూవీ టీజీర్ కు పవన్ కల్యాణ్ తన వాయిస్ ఓవర్ ఇచ్చాడు.  పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న టైమ్ లో మెగాస్టార్ పక్కనే ఉండటం గమనార్హం.

కాగా  అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సూచనలు, సలహాలు పాటిస్తూ.. సైరా టీజర్ కు అద్భుతంగా వాయిస్ ఓవర్ అందించాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ విషయాన్ని కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసింది. ఫొటోస్ కూడా షేర్ చేసింది.

ఇదిలా ఉంటే సైరా సినిమా టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు యూనిట్ థ్యాంక్స్ చెప్పింది. ఇప్పటి వరకు చరిత్ర చెప్పని ఓ వీరుడి గాథను ఓ ప్రజా నాయకుడు తన గొంతు ద్వారా వినిపిస్తున్నాడంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి ట్వీట్ చేశాడు. సైరా టీజర్ ను మరో ఆగస్ట్ 20న విడుదల చేయబోతున్నారు.