డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో పవన్ కళ్యాణ్ 27వ చిత్రం?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జగర్లమూడితో చేయబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  మొఘల్ యుగంలోని జానపద కల్పనపై ఈ సినిమా కథ ఉంటుందని, దీన్ని ఏఎం రత్నం నిర్మించనున్నట్లు తెలిపారు.

Updated: Jan 22, 2020, 08:36 PM IST
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో పవన్ కళ్యాణ్ 27వ చిత్రం?

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జగర్లమూడితో చేయబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  మొఘల్ యుగంలోని జానపద కల్పనపై ఈ సినిమా కథ ఉంటుందని, దీన్ని ఏఎం రత్నం నిర్మించనున్నట్లు తెలిపారు. .

దర్శకుడు క్రిష్ మాటాడుతూ.. ప్రాజెక్ట్ జనవరి 27న లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ ను  వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూవీ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా డేట్ కూడా వచ్చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్‌తో సినిమా చేయాలన్న 10 సంవత్సరాల కల నెరవేరడానికి సమయం ఆసన్నమైందని నిర్మాత ఎ.ఎం.రత్నం తెలిపారు. 

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ తన సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు. పవన్ 25వ చిత్రంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పలు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నా కూడా రాజకీయాలతో పవన్ బిజీ అయ్యారు. మళ్లీ ఈ స్టార్ హీరో సినిమాల్లో నటించడం అనుమానమే అంటూ ప్రచారం జరిగింది. 

అయితే సినిమాల్లో నటిస్తాడో లేదో అనుకున్న పవన్ వరుసగా చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తన 26వ చిత్రంగా ‘పింక్’ రీమేక్‌ను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. సోమవారం పవన్ షూటింగ్‌కు కూడా హాజరు అయ్యారని తెలిసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..