హెల్మెట్ ధరించిన పెంపుడు శునకం.. వైరల్ అవుతున్న ఫోటో

పెంపుడు జంతువులు తమ యజమానితోపాటు ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం సర్వసాధారణమే. అయితే.. తన యజమానితో పాటు తాను కూడా హెల్మెట్ ధరించి ఒక పెంపుడు శునకం ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం మాత్రం అసాధారణం. ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Updated: Jan 9, 2020, 04:16 PM IST
హెల్మెట్ ధరించిన పెంపుడు శునకం.. వైరల్ అవుతున్న ఫోటో

చెన్నై : పెంపుడు జంతువులు తమ యజమానితోపాటు ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం సర్వసాధారణమే. అయితే.. తన యజమానితో పాటు తాను కూడా హెల్మెట్ ధరించి ఒక పెంపుడు శునకం ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం మాత్రం అసాధారణం. ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెన్నైలోని విరుగంబాకంలో తీసిన ఈ ఫొటోలో ఒక పెంపుడు శునకం హెల్మెట్ పెట్టుకుని తన యజమాని వెనుక కూర్చుని టూవీలర్‌లో ప్రయాణించిన ఫోటో వైరల్ అవుతోంది. 

బైక్ వెనుక కదలకుండా కూర్చున్న ఆ శునకం తన ముందు కాళ్లను యజమాని భుజంపైన వేసి దర్జాగా వెళుతుండడాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. వాహనాన్ని నడిపిస్తున్నవాడే కాదు వెనుక కూరున్న వారు కూడా తమ భద్రత కోసం హెల్మెట్ ధరించాలన్న నిబంధన చెన్నై, ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాలలో ఇప్పటికే అమలులో ఉంది. ఆ నిబంధనను ఖచ్ఛితంగా పాటిస్తున్న ఆ శునకానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..