సరికొత్త గెటప్; శివగామి శృంగార తార అవతారం !!
బాహుబలిలో అమ్మా, నాయనమ్మ పాత్రలో నటించిన సీనియర్ నటి రమ్యకృష్ణ ఇప్పుడు సరికొత్త పాత్రలో నటిస్తున్నారు

శిగగామి ఎవరని అడిగితే.. ఇట్టే చెప్పేస్తారు రమ్యకృష్ణ పేరు. బాహుబలి లో శివగామి పాత్రలో నటించి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ ‘శైలజా రెడ్డి అల్లుడు’లో నాగచైతన్యకు అత్తగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం తమిళ సినిమా ‘సూపర్ డీలెక్స్’లో నటిచేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అందులో రమ్యకృష్ణ శృంగార తారగా కనిపించబోతున్నారట.
ట్రాన్స్ జెండర్ పాత్రలో సేతుపతి
విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఇది.. ఇందులో విజయ్ సేతుపతి లింగమార్పిడి చేయించుకున్న మహిళ పాత్రలో నటిస్తుండగా.. అక్కినేని సమంత హంతకురాలి పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను ఇప్పటికే విడుదల చేశారు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.