సల్మాన్ ఖాన్ అందుకే పెళ్లి చేసుకోలేదట!

సల్మాన్ ఖాన్ అందుకే పెళ్లి చేసుకోలేదట!

Last Updated : Jul 25, 2019, 07:05 PM IST
సల్మాన్ ఖాన్ అందుకే పెళ్లి చేసుకోలేదట!

సల్మాన్ ఖాన్ పేరెత్తితే మొదటిగా గుర్తొచ్చే అంశాల్లో అతడి పెళ్లి ప్రస్తావన ఒకటి. ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన ఈ కండ‌ల వీరుడు 53 ఏళ్ల వయస్సులోనూ పెళ్లి చేసుకోకుండా బ్యాచిల‌ర్‌గానే ఉండిపోయాడు. అయితే, ఇప్పటికే ఎన్నో సినీ అవార్డ్స్ ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్‌లో పెళ్లి ప్రస్తావన రాగా ఆ విషయంపై తనదైన స్టైల్లో సరదాగా స్పందిస్తూ వెళ్లిన సల్మాన ఖాన్‌కి తాజాగా మరోసారి తాను ఎందుకో ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్ప‌టిర‌కు త‌న‌ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోమ‌ని అడ‌గ‌లేద‌ని, అందుకే తాను పెళ్లి కాకుండానే బ్యాచిలర్‌గా ఉండిపోయాన‌ని స‌ల్మాన్ ఖాన్ వెల్ల‌డించాడు.

''తన జీవితంలో ఏ అమ్మాయి తన వద్ద పెళ్లి ప్ర‌పోజ‌ల్ తీసుకురాలేదు. తానెప్పుడూ క్యాండిల్ లైట్ డిన్న‌ర్స్ చేయ‌లేదు. క్యాండిల్ లైట్‌లో ఏమి పెడుతున్నారో కూడా చూడ‌కుండా తిన‌లేను. అయితే తనను ఎవ్వరూ పెళ్లి చేసుకోమని అడగలేదు'' అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ విషయంలో తనకు చాలా బాధగానూ ఉంది'' అని స‌ల్మాన్ వివరించాడు. అయితే, సల్మాన్ ఇలాంటి సమాధానం ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అనేక అవార్డ్స్ ఫంక్షన్స్‌లో, ఇంటర్వ్యూల్లో సల్మాన్ ఇదే తరహా సమాధానాలు ఇచ్చాడనే సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి.

Trending News