close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఆగస్టు 15 నుంచి ''రణరంగం'' అంటున్న శర్వనంద్

స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి రణరంగం ఏంటని ఆశ్చర్య పోకండి.

Updated: Jul 17, 2019, 06:34 PM IST
ఆగస్టు 15 నుంచి ''రణరంగం'' అంటున్న శర్వనంద్

స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి రణరంగం ఏంటని ఆశ్చర్య పోకండి.  అది యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్ జంటగా నటిస్తున్న 'రణరంగం' మూవీ రిలీజ్ డేట్.. దినీ గురించి మరిన్ని విషేషాలు కావాలంటే వివరాల్లోకి వెళాల్సిందే..

సుధీర్ వర్మ డైరక్షన్ లో  శర్వానంద్, కాజల్ జోడీగా నటిస్తున్న  రణరంగం మూవీ రిలీజ్కి సంబంధించి ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. పోస్టు ప్రొడక్షన్ పనులన్నీ సవ్యంగా జరిగితే ఈ మూవీ ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్రయూనిట్ డిసైడ్ అయింది.  చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..రణరంగం మూవీని ఆగస్టు 15 న విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తర్వలోనే మిగిలిన పనులు పూర్తి చేసుకొని అనుకున్న డేట్ కి తెరపైకి ఎక్కిస్తామన్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న రణరంగం మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళ్లినట్లయితే సినిమాలో హీరో శర్వానంద్ ఓ గ్యాంగ్ స్టర్. అతడి జీవితంలో 1990, 2000 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలే ఈ రణరంగం. ఇందులో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు శర్వ. మరింత డీటైల్ స్టోరీ కావాలంటే మూవీ చూడాల్సిందే మరి.