close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తెలుగు రాష్ట్రాల్లో 'సైరా' హంగామా  !!

మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరపైకి వచ్చి సైరా అంచనాలకు తగట్టుగానే ధియోటర్స్ లో మంచి ఫెర్ఫామ్ ఇస్తోంది.

Updated: Oct 2, 2019, 10:57 AM IST
తెలుగు రాష్ట్రాల్లో 'సైరా' హంగామా  !!

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్  'సైరా' థియోటర్స్ లోకి వచ్చేసింది. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కావడంతో సైరాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది సైరా. 

ఏపీలో అర్థరాత్రి నుంచే  మొదలు
తెలుగు రాష్ట్రాల్లో సైరా హంగామా అర్థరాత్రి నుంచే మొదలైంది.  ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో అర్థరాత్రి ఒంటి గంట నుంచే సైరా షోలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి ప్రభుత్వం.. వారం రోజుల పాటు రోజుకు 6 షోలు వేసుకునేలా ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

తెలంగాణలోనూ ప్రత్యేక షోలు

ఇటు తెలంగాణలో కూడా సైరా హంగామా పీక్స్ లో కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు చాలా ఏరియాల్లో ఉదయం 7 గంటలకే షోలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కార్ కూడా సైరాకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికైతే అవధుల్లేవ్. నిన్న సాయంత్రం నుంచే కటౌట్లకు పాలాభిషేకాలు, రోడ్లపై బాణసంచా కాల్చడంతో హంగామా స్టార్ట్ చేశారు.

సైరా సూపర్ హిట్ టాక్

కంప్లీట్ పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయింది సైరా. ముంబయిలో నిన్న సాయంత్రమే మీడియా కోసం ప్రత్యేకంగా షో వేశారు. వాళ్లంతా సినిమాపై చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అర్థరాత్రి నుంచే షోలు మొదలవడంతో అక్కడ్నుంచి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇలా కంప్లీట్ పాజిటివ్ టాక్ తో మొదలైంది సైరా ప్రస్థానం.